అయితే పుదీనాను కేవలం రుచికి, వాసనకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకూ, సౌందర్యాన్నిపెంపొందించు కోవడానికి కూడా ఉపయోగించవచ్చును. పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ప్రకృతిలో మనకు దొరికే ప్రతి ఒక్క మొక్కలోనూ , ఆకులోనూ ఏదో ఒక ఔషధ గుణం కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా పుదీనా గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఆకుపచ్చని రంగులో ఉండి చూడడానికి చూడముచ్చటగా సువాసనలు వెదజల్లే ఆకు ఏదైనా ఉంది అంటే అది వెంటనే గుర్తొచ్చేది పుదీనా. నిజమే .. ఏదైనా వంట చేసేటప్పుడు అందుకు చక్కటి సువాసన తోపాటు రుచిని తీసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా వంటలో పుదీనా వాడాల్సిందే.
అయితే పుదీనాను కేవలం రుచికి, వాసనకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకూ, సౌందర్యాన్నిపెంపొందించు కోవడానికి కూడా ఉపయోగించవచ్చును. పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
పుదీనాలో ముఖ్యంగా విటమిన్ C , విటమిన్ D , విటమిన్ E , విటమిన్ B లు అధికంగా ఉండడంతో పాటు క్యాల్షియం, పాస్పరస్ వంటి మూలకాలు వలన రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు సైతం దూరం అవుతాయి.
పుదీనా రక్త ప్రసరణను క్రమబద్దీకరించడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
కడుపులో మంట, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో దంతాలు తోముకోవడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
ఒక పుదీనా ఆకుల రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల అజీర్తి , కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది వాంతులతో బాధపడుతుంటే పుదీనా రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని కొద్ది కొద్దిగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
నిద్రలేమితో బాధపడేవారు పుదీనా ఆకుల్ని ఒక గ్లాసు మంచి నీళ్ళలో వేసి మూత పెట్టి అరగంట తర్వాత తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది, మానసిక ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు.
చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్ లకు తాజా పుదీనా ఆకులను కొన్ని చేతితో నలిపి రసం లా తీసి ఆ రసంలో దూది అద్ది ఒక్క చుక్క ప్రకారం చెవిలో, ముక్కులో వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.
నోటి దుర్వాసన వస్తుంటే పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేసి అందులో కొద్దిగా ఉప్పు కలిపి రోజూ పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లగా అవ్వడమే కాకుండా నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.