కాలీఫ్లవర్ అంటే ఇష్టమా.. అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!

By Mahesh Rajamoni  |  First Published Mar 23, 2023, 12:33 PM IST

ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కాలీఫ్లవర్ లో ఉంటే విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు సహాయపడుతుంది. అలాగే సంక్రమణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 


కాలీఫ్లవర్ మన  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరగాయలో విటమిన్ కె, కోలిన్, ఇనుము, కాల్షియంతో  పాటుగా ఎన్నో ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాలీఫ్లవర్ లో ఫైబర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్ కంటెంట్ మన మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఒక కప్పు కాలీఫ్లవర్ లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ మెరుగైన పనితీరుకు, బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.

కాలీఫ్లవర్ సల్ఫోరాఫేన్ అనే మొక్కల సమ్మేళనం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ కూరగాయలో ఉండే సల్ఫోరాఫేన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. అలాగే  గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. 

Latest Videos

undefined

కాలీఫ్లవర్ లో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రోగాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. 

కాలీఫ్లవర లో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ సి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

కాలీఫ్లవర్ choline కు గొప్ప వనరు. ఇది మానసిక స్థితికి, జ్ఞాపకశక్తికి అవసరమైన పోషకం. అలాగే ఇది కేంద్ర నాడీ వ్యవస్థకు సందేశాన్ని అందించే ఎసిటైల్కోలిన్ కు కూడా చాలా అవసరం. మెదడు అభివృద్ధికి choline చాలా అవసరం.

కాలీఫ్లవర్ లో ఇండోల్ -3-కార్బినాల్ (ఐ 3 సి) అనే మొక్కల సమ్మేళనం ఉంటుంది. ఇది మొక్కల ఈస్ట్రోజెన్ గా పనిచేస్తుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. 

ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీ లో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం.. కాలీఫ్లవర్ లో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీన్ని బలోపేతం చేస్తుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

click me!