బ్రోకలీ పోషకాల బాంఢాగారం. దీనిని రెగ్యులర్ గా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
బ్రోకలీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి, విటమన్ కె, విటమన్ ఎ, ఫోలేట్, కాల్షియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లతో సహా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో ఉన్న శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడమే కాదు డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.
సమతుల్య ఆహారం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో బ్రోకలీలో కూడా ఉంటుంది. బ్రోకలీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్రోకలీలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్లు గుండె జబ్బులొచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
undefined
బ్రోకలీలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది అధిక రక్తపోటు సమస్య వచ్చే ప్రమాదాన్నిచాలా వరకు తగ్గిస్తుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ కు ప్రధాన కారణం.
బ్రోకలీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాదు గట్ ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే పెద్దప్రేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
బ్రోకలీలో మన రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా ఉంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బ్రోకలీ కొంతవరకు దృష్టి నష్టాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే దృష్టి నష్టం సమస్యను నివారించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
పెద్దప్రేగు పూత, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్) ఉన్నవారికి బ్రోకలీ ఎంతో మేలు చేస్తుంది. వీరు బ్రోకలీని తీసుకుంటే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 2017 లో జె ఫంక్ట్ ఫుడ్స్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. బ్రోకలీతో సహా మంచి పోషకాహారాన్ని తిన్న వ్యక్తులు మంచి గట్ మైక్రోబయోమ్ లను కలిగి ఉన్నారని కనుగొన్నారు.
హెల్త్ లైన్ ప్రకారం.. బ్రోకలీలో ఉండే పోషకాలు, మొక్కల సమ్మేళనాలు వృద్ధాప్యం వల్ల కలిగే చర్మ, మానసిక సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి.