సహజంగా విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా మనకు అందుతుంది. అయితే... అలా కాకుండా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి పుష్కలంగా అందుతుందట. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
మన దేశంలో విటమిన్ డి లోపంతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. విటమిన్ డి లోపం కారణంగా చాలా రకాల సమస్యలు వస్తాయి. మూత్రపిండాల సమస్యలు ఏర్పడతాయి. ఎముక ఆరోగ్యాన్ని బలహీనం అవుతుది. తరచుగా అనారోగ్యానికి గురౌతూ ఉంటారు. చిన్న పనులకే అలసిపోతూ ఉంటారు.జుట్టు విపరీతంగా రాలిపోతుంది. తొందరగా డిప్రెషన్ కి గురౌతూ ఉంటారు. చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే కచ్చితంగా మన శరీరానికి విటమిన్ డి అందాలి. సహజంగా విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా మనకు అందుతుంది. అయితే... అలా కాకుండా కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి పుష్కలంగా అందుతుందట. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
1.సాల్మన్ ఫిష్..
సాల్మన్ ఫిష్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి... దీనిని వారానికి ఒకసారైనా ఆహారంలో భాగం చేసుకోవాలి.
undefined
2.డెయిరీ ఉత్పత్తులు, ఆవు పాలు, సోయా మిల్క్ వంటి వాటిలో సైతం విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
3.ఆరెంజ్ జ్యూస్ లోనూ విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అయితే.... డయాబెటిక్ రోగులు మాత్రం ఆరెంజ్ జ్యూస్ తీసుకునే సమయంలో వైద్యుల సలహా తీసుకోవాలి.
4.ఒక పెద్ద కోడిగుడ్డులో 37 ఐయూ ల విటమిన్ డి ఉంటుంది. కాబట్టి.. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల కూడా విటమిన్ డి శరీరానికి అందుతుంది.
5.చాలా మందికి చేపలు తినడం ఇష్టం ఉండదు. అలాంటి వారు కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సిల్స్ మార్కెట్లో లభిస్తాయి. వాటిని తీసుకోవచ్చు. వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
6.నాన్ వెజ్ తినే అలవాటు లేనివారు మష్రూమ్స్ కూడా తీసుకోవచ్చు. అందులోనూ విటమిన్ డి ఉంుటంది.