ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 3 తేడాలు దాగి ఉన్నాయి, వాటిని 30 సెకన్లలో కనిపెట్టి చూడండి

Published : Aug 26, 2025, 10:05 AM IST
Optical Illusion

సారాంశం

మెదడుకు వ్యాయామం చేయాలనుకుంటే ఆప్టికల్ ఇల్యూషన్లే ఉత్తమ మార్గం. ఇవి చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. కానీ ఇవి మీకు చెమటలు పట్టేలా చేస్తాయి. ఇక్కడ మేము అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. 

మెదడుకు, కంటికి వ్యాయామం చేయాలంటే అప్పుడప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లను ఆశ్రయించాలి. పదునైన చూపు, వేగంగా పనిచేసే మెదడు మాత్రమే ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా సాధించగలవు. కాబట్టి పిల్లలైనా, పెద్దలైనా అప్పుడప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లను ఛేదించడం అలవాటు చేసుకోండి. నిజానికి మీ మెదడుకు మీరు మంచి శిక్షణ ఇవ్వాలంటే ఆప్టికల్ ఇల్యూషన్ గొప్ప మార్గం అని చెప్పాలి. 

ఇక్కడ మేము అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ను ఇచ్చాము. అందులో ఒక అమ్మాయి టెన్నిస్ ఆడుతూ ఉంది. ఆమె రెండు ఫోటోలలో మూడు తేడాలు ఉన్నాయి. ఆ మూడు తేడాలను కనిపెట్టి చెబితే మీ కంటిచూపు, మెదడు పనితీరు అద్భుతం అని ఒప్పుకుంటాము. ఎక్కువ సమయం ఇస్తే మీరే కాదు చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. కాబట్టి మేము మీకు ఇస్తున్న సమయం కేవలం 30 సెకన్లు మాత్రమే. ఈ 30 సెకన్లలో ఈ రెండు ఫోటోల్లో ఉన్న తేడాను మీరు కనిపెట్టి చెప్పాలి. కేవలం మూడు తేడాలను మాత్రమే ఇచ్చాము.

ఇప్పటికే సమాధానాన్ని కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న మూడు తేడాలను 30 సెకన్లలోనే కనిపెట్టారు. అంటే మీ కంటి చూపు, మెదడు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇక కనిపెట్టలేక ఇబ్బంది పడుతున్న వారి కోసమే మేము జవాబును ఇచ్చేసాము.

తేడాలు ఇవే

మొదటి తేడా ఆమె జుట్టు. ఆమె జుట్టు కొనలు ఆ గ్రౌండ్ బౌండరీలను దాటి కిందకు ఉంది. మరొక ఫోటోలో మాత్రం కొంచెం పైకి ఉంది. ఇక్కడ రెండో తేడా బాల్. బాల్ పై ఉన్న గీతలు చెరోవైపు ఉన్నాయి. ఇక మూడో తేడా ఆ అమ్మాయి కాలు. ఆ అమ్మాయి షూ కి... బౌండరీ లైన్‌కి మధ్య తేడా ఒక దాంట్లో తక్కువగా ఉంటే మరొక ఫోటోలో ఎక్కువగా ఉంది. ఈ మూడే తేడాలు.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో అధికంగానే ఉంటాయి. వీటిని తరుచూ సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. అలాగే చదువుకునే పిల్లలకు కూడా వీటిని ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పండి. ఇది వారిలో పరిశీలనా శక్తిని పెంచుతాయి. వారి పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?