Ayodhya Ram Mandir : అయోధ్యలో బాలరాముడి ప్రాణ్ ప్రతిష్ఠ : ఇంట్లో రామపూజ ఎలా చేయాలి .. ?

By Siva KodatiFirst Published Jan 21, 2024, 7:55 PM IST
Highlights

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశవ్యాప్తంగా హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతే.. ఏం చేయాలి. దీనికి జ్యోతిష్యశాస్త్ర నిపుణుడు పండిట్ జగన్నాథ్ గురూజీ పరిష్కారం చెప్పారు. 

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశవ్యాప్తంగా హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జనవరి 18న బాలరాముడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి విగ్రహాన్ని వస్త్రంతో కప్పివుంచారు. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహం కన్నులను జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రతిష్టాపన ముహూర్తంలో ఆవిష్కరించనున్నారు. మీరు ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతే.. ఏం చేయాలి. దీనికి జ్యోతిష్యశాస్త్ర నిపుణుడు పండిట్ జగన్నాథ్ గురూజీ పరిష్కారం చెప్పారు. ఆయన సూచించిన విధంగా రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ట సమయంలో మీ ఇంట్లో రామ పూజ చేయవచ్చు. 

రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ సమయంలో ఇంట్లో పూజ ఎలా చేయాలి :

‘‘ఓం రామ్ రామాయ నమ: ’’ అంటే ‘‘రాముడికి విజయం’’ ని అర్ధం. జనవరి 22, 2024న మధ్యాహ్నం 12.20 నుంచి 12:45 గంటల మధ్య జరగనున్న రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రజల ఇళ్లలో దీనిని తప్పనిసరిగా పఠించాలని జగన్నాథ్ చెప్పారు. ఒకవేళ ప్రాణ్ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనకపోతే.. ఇంట్లో పూజ చేయడం ద్వారా దానిలో పాలు పంచుకోవచ్చు. మరి ఇంట్లో పూజ ఎలా చేయాలంటే..?

  • మీ ఇంటి పూజగదిని శుభ్రపరచడం ద్వారా పూజను ప్రారంభించాలి
  • శుద్ధి చేసి స్నానం చేయండి
  • మీ నుదిటిపై సువాసనల గల చందన్ తిలకంతో గుర్తు పెట్టుకోండి , ఇది దైవిక అనుబంధానికి చిహ్నం
  • లేత రంగు వస్త్రాలను ధరించండి
  • పాలు, తేనే, ఇతర పవిత్రమైన నైవేద్యాలను ఉపయోగించి శ్రీరాముని విగ్రహానికి అభిషేకం, ఉత్సవ స్నానం చేయండి. ఇది విగ్రహాన్ని మాత్రమే కాదు, వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
  • పూజ చేసే పీఠం కింద లేదా మందిరం వద్ద ముగ్గును వేసి అలంకరించండి. స్వస్తిక లేదా ఓం చిహ్నాన్ని గీయండి.
  • మీ సమర్ఫణల కోసం ఒక శక్తివంతమైన బలిపీఠాన్ని సృష్టించి, టేబుల్‌పై శుభ్రమైన ఎర్రటి గుడ్డను పరచండి
  • దాని మధ్యలో సమృద్ధి, శ్రేయస్సుకు ప్రతీకగా బియ్యాన్ని ఒక దిబ్బలా పోసి.. దానిపై స్వచ్ఛమైన నీటితో నిండిన రాగి కలశాన్ని వుంచండి.
  • దైవిక ఆశీర్వాదాలను కోరుతూ.. పసుపు, కుంకుమ, పువ్వులతో కలశాన్ని అలంకరించండి. దానిలో కొబ్బరికాయను వుంచి, కిరీటంలా ఏర్పాటు చేసి తాజా పండ్లను దాని చుట్టూ పెట్టండి.
  • ప్రకృతి బహుమతులు దైవంపై కురిపించినట్లుగా వాటిని కలశం పునాది చుట్టూ వుంచండి
  • బాలరాముడి విగ్రహాన్ని మీకు అభిముఖంగా వుంచుకోండి, దానిపై పువ్వులతో అర్చన చేయండి. 
  • ఓం రామ్ రామాయ నమ: అనే రామ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  • శ్రీరాముడి ఆశీస్సులు మీకు లభించినట్లుగా భావన చేయండి.
click me!