Parenting Tips : మీ పిల్లల్ని ఎలా పెంచాలి..? ఎలా పెంచకూడదు..?

Published : Apr 18, 2026, 10:36 PM IST
Parenting

సారాంశం

ఈ కాలం పేరెంట్స్ పిల్లల పెంపకాన్ని అవుట్ సోర్స్ చేసేసారు. దెయ్యాలకు... భూతాలకు.. రాక్షసులకు పిల్లల్ని పెంచి పెద్దచేసే బాధ్యత అప్పగించేశారు. మరి రాక్షసుల వద్ద పెరిగిన పిల్లలు ఏమవుతారు..?

"కాలం పిల్లలు మాట వింటారా..?"

ఏ కాలం..?

రాహు కాలం..?

గుళిక కాలం..?

యమ గండం..?

కలికాలం..?

మనిషి పుట్టి 40 లక్షల సంవత్సరాలయ్యింది.

ఇంతకాలం లేనిది పుసిక్కున ఇప్పుడే.. పదేళ్ళలో ఏమైంది..?

39, 99, 990 సంవత్సరాలు.. తలితండ్రులు... పిల్లల్ని పెంచి పెద్ద చేసేవారు.

ఇదే మానవ జాతి చరిత్ర..

సమాజానికి... దానిలోని సంస్కృతికి ఇదే మూలం.

నిజమే కాలం మారింది.

మారింది పిల్లలు కాదు.

పిలల్లు దేవుడు ఎప్పుడూ చల్లని వారే.

మారింది.. బుద్ధిలేని పెద్దలే.

అవుట్ సోర్చింగ్ .

ఈ కాలం పేరెంట్స్ పిల్లల పెంపకాన్ని అవుట్ సోర్స్ చేసేసారు.

అదీ ఎవరికి..?

దెయ్యాలకు... భూతాలకు.. రాక్షసులకు..

పిల్లల్ని పెంచి పెద్దచేసే బాధ్యత అప్పగించేశారు.

రాక్షసుల వద్ద పెరిగిన పిల్లలు ఏమవుతారు..?

ఆన్సర్ చాలా సింపుల్.

రాక్షస సంతానమవుతారు.

నేడు ప్రతి ఇంట్లో డిజిటల్ పరికరాలతో ప్రతి ఒక్కరు... గంటల కొద్దీ కనెక్ట్.

కుటుంబ సభ్యులు డిస్కనెక్ట్.

మాటల్లేవు... మాట్లాడుకోవడాలు లేవు..

మరి..?

రీల్స్.. వీడియోస్.. ఆన్లైన్ గేమ్స్.

అన్నీ ఆన్లైన్.. ఆఫ్ లైన్ కావడానికి టైం దొరకదు.

పిల్లలతో గడపడానికి టైం ఏది..? అని దబాయింపు..!

నిజమే .. ఇప్పుడు ఆఫీస్ లు అర్థరాత్రి దాక..

కానీ మనసుంటే మార్గం ఉండదా..?

ఎవరూ బిజీ కాదు...

మనకిష్టమయిన పనిని చేయడానికి సమయం తప్పక దొరుకుతుంది.

చేయడం లేదంటే కారణం ఒక్కటే..

పిల్లల పెంపకం .. అనే పనిలో తీపి ఎరుగని అమాయకత్వం.. అవగాహనాలోపం.

అది బరువు కాదు .. మాటలకందని అనుభూతి. మనిషికి మాత్రం అర్ధమయ్యే ప్రక్రియ.

చిన్నప్పుడే మొబైల్ ఇచ్చేస్తే.. వారి ఆలోచనలను డిజిటల్ రాక్షసులు హైజాక్ చేసి.. బ్రెయిన్ వాష్ చేసేస్తారు.

కొంపలో రాక్షసుడు తయారయ్యాక... లెక్చర్ దంచితే మాట వింటారా..?

"ఈ కాలం పిల్లలు మన మాట వినరు" అని నిందలెందుకు..?

మాటలు వచ్చినప్పటి నుంచి పిల్లలు... మీకు ఎన్ని వేల, లక్షల అవకాశాలు ఇచ్చారు..?

"అదేంటి..?"

"ఇదేంటి?"

"ఇది ఆలా ఎందుకు ఉంది?"

"అది ఇలా లేదెందుకు?"

"ఇలా చేస్తే ఏమవుతుంది?"

"ఆలా ఎందుకు చేయకూడదు?" ...

అబ్బో...

ఎన్ని ... ఎన్ని... ఎన్ని ... ప్రశ్నలు.

ఇప్పటిదాకా కోటి తరాలు.

నీ ముందు 99,99,999 తరాల వారు ఇలాగే పెరిగారు... నేర్చుకొన్నారు.. పెద్దయ్యారు.

ఆంథ్రోపాలజీలో దీన్నే సమాజీకరణ.. సంస్కృతి స్వీకరణ అన్నారు.

మనిషికి గొడ్డుకు ఒక తేడా ఉంది.

జంతువుల ప్రవర్తన సహాజితం.

బౌ బౌ అని మొరగమని కుక్కకు తల్లి కుక్క చెప్పనక్కర లేదు.

కానీ తెలుగో, ఇంకో భాషో నేర్పాల్సింది తల్లే .. తల్లి ఒడిలోనే బిడ్డ ఎదుగుతాడు.. భాష, నీతి, నియమం, మంచి చెడు నేర్చుకొంటాడు. తల్లి పెంపకం వల్లే శివాజీ, నేతాజీ లొచ్చారు.

తల్లి అంటే బిడ్డకు సమాజాన్ని నేర్పేది.

ఆధునిక కాలంలో పని విభజనలో మార్పులొచ్చాయి. కాబట్టి ఇప్పుడు తల్లి అంటే కేవలం తల్లి కాదు.. తల్లిదండ్రి...

తల్లి తండ్రే మొదటి గురువులు..

ప్రశ్నల పుట్టలు.

వారు యక్షులు ..

మీరు ధర్మరాజులా వారికి సమాధానాలు ఇవ్వాలి.

అప్పుడే చచ్చిన కుటుంబాలు తిరిగి లేస్తాయి.

కాంక్రీటు అరణ్య పర్వం సుఖవంతమవుతుంది.

పిల్లలతో గడపాలి.

దానికి మించిన కిక్కు ఏదీ ఉండదు .

లక్ష టీవీ సీరియల్స్ ఇవ్వని ఆనందాన్ని ఆక్సిటోసిన్ ను ఇది ఇస్తుంది.

ఆక్సిటోసిన్ అంటే ఆరోగ్యం.

డిజిటల్ డోపమైన్ ఊబి... సమాధి... కుటుంబం కబరస్థాన్ గా మారిపోతుంది.

పిల్లలకు డిజిటల్ స్క్రీన్ లు వద్దే వద్దు... పెద్దలు ఆఫీస్ పనులకోసం... మంచి కంటెంట్ కోసం.. రోజుకు ఇంత అని... లిమిటెడ్ టైం.

పిల్లలతో మాట్లాడు.. ఆటలాడు..

లెక్చర్లు వద్దు... మంచి-చెడు కథల రూపంలో చెప్పాలి .

బెడ్ టైం స్టోరీస్... రోజూ నీ మాట వినడానికి అలవాటు పడిన బిడ్డ నీ చేయి దాటి ఎన్నటికీ పోడు. పేగుబంధం నీ కట్టె కాలే దాక.. ఆ పైన కూడా పిండాల రూపంలో కొనసాగుతుంది.

ఇదేలే తరతరాల చరితం..!

కంచికి పోతావా కృష్ణమ్మా..!

"నాకు ఏమి కథలు వచ్చు?" అనొద్దు.

నీ పూర్వీకులు కంచికి పంపిన కథలు వేలు లక్షలు... కంచి కి పో.. కథలు పోగేసుకొని తెచ్చుకో..

లేదంటే నీ కోసమే వస్తోంది "సంగం".

సంగమం..

సంగమం..

అనురాగ సంగమం ..

ఆనంద సంగమం ..

1. కథలు.. కథలు చాల మటుకు పాతవే. వాటిని ఎలా చెప్పాలి అనేది కొత్త.

2. నువ్వే ఒక పుస్తకం. నీ జీవిత అనుభవాలు అనుభూతులు కష్టాలు సుఖాలు... పిల్లలకు ఎలా చెప్పాలి.

3. సమాజమే అతి పెద్ద గ్రంధం.. చుట్టూ జరుగుతున్న ఘటనల్ని టీన్ ఏజ్ పిల్లలతో ఎలా చర్చించాలి..

4. పిల్లలతో ఇంటిలో, బయట ఆడే ఆటలు..

పేరెంటింగ్ టాస్క్ ను అవుట్ సోర్చింగ్ చేసి కొంపలోకి కొరియన్ కొరివి దెయ్యాలను వదిలేసిన ఆధునికతరం పేరెంట్స్ కోసం .. వాసిరెడ్డి అమర్నాథ్ సారధ్యంలో.. అర్చన, నిధి, దీపింతి, మాధవి, బిందు, డాలీ, దీక్షిత్, సునీత, జయలక్ష్మి, ఉష, వంశీ మొదలయిన స్లేట్/కాగ్నిబోట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ విరచితం.. సంగం.

ఒక్కో తరగతి కి ఒక్కో పుస్తకం. ఇది పెద్దబాల శిక్ష.

పెద్దలయిన వారికి అంటే తల్లితండ్రికి అవ్వాతాతకు

ప్రతి పేరెంట్ గ్రాండ్ పేరెంట్ చదవాల్సిన పుస్తకాలు.

చదవడంతో సరిపోదు.

అటుపై పేరెంటింగ్ ను ఇన్ సోర్స్ చేసుకోవాలి.

ఆఫ్ లైన్ కావాలి. లైఫ్ లో మజా ఆస్వాదించాలి.

ప్రతి ఇంటా ఆనందం వెల్లి విరియాలి.

ప్రతి ఒంట్లో ఆక్సిటోసిన్ హార్మోన్ ఏరులై పారాలి.

మరో యాభై ఏళ్లకు కూడా వాసిరెడ్డి అమర్నాథ్ ను సమాజం గుర్తు పెట్టుకొంటే దానికి కారణం.. త్రిశూల్.

1. సంపూర్ణత ,2. త్రయోదశి 3. సంగం...

ఎల్ కేజీ నుంచి పది దాక.. ఒక్కో తరగతికి మూడేసి పుస్తకాలు. మొత్తం 36 పుస్తకాలు. మరో వారంలో అందుబాటులోకి వస్తాయి. బాలమిత్ర క్లాసుకు రండి. అక్కడే దొరుకుతాయి.

వాసిరెడ్డి అమర్నాథ్ పేస్ బుక్ పోస్ట్ ల సారం - సంపూర్ణత..! పిల్లల కోసం - వారి స్థాయిలో - AI చాట్ బోట్ లు కూడా చెప్పలేని విజ్ఞాన సర్వస్వం.

త్రయోదశి - AI ఏజ్ లో అవసరమయిన 13 మానవ నైపుణ్యాల వర్క్ బుక్..!

ఇవి స్లేట్ / కాగ్నిబోట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు.

ప్రతి రోజు ఒక్కో పీరియడ్ లో మెంటార్స్ వాటిని బోధిస్తారు.

మన చుట్టూరా మురికి నీరు ఉంటే మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకొన్నా సరి పోదు.

అందుకే ఈ పుస్తకాలు .. పేరెంటింగ్ ను ఇన్ సోర్స్ చేసుకోవాలనే ప్రతి తల్లితండ్రికి అందుబాటులో తెస్తున్నాము .

మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తారా..?

వారిని కృతిమ మేథయుగంలో విజేతలుగా నిలపాలనుకొంటున్నారా..?

అయితే కలుద్దాము..!

మీ ఊరి కొస్తా..!

మీ బడికొస్తా..!

ఒక్కొక్కరు కాదు .. వందలాది మంది వేలాది మంది రండి..

పిల్లలకు మంచి భవితను అందిద్దాము..!

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Worlds ugliest car: ప్రపంచంలోనే అత్యంత వికారమైన కారు ఇది.. 35 ఏళ్ల తరువాత మళ్లీ రోడ్డు మీదకొచ్చింది
Pink Lake: ఈ సరస్సులో నీళ్లు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లాగా ఎందుకు ఉంటాయో తెలుసా?