పానిక్ కాల్ వచ్చేవరకు వేచి ఉండొద్దు.. వృద్ధ తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటే సంక్షోభం రాకముందే కేర్ ప్లాన్ అవసరం : అన్వయా ప్రశాంత్ రెడ్డి

Published : May 29, 2026, 04:14 PM IST
Prashanth Reddy

సారాంశం

ఈ బిజీ లైఫ్ లో ఉద్యోగాలు, ఉపాధి కోసం పిల్లలు ఒకచోట… వారి తల్లిదండ్రులు ఒకచోట ఉంటున్నారు. ఇలాంటి సమయంలో పేరెంట్స్ సంరక్షణ కష్టం అవుతుంది. దీనికి సొల్యూషన్ చెబుతున్నారు అన్వయా కిన్ కేర్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి.

Hyderabad : వృద్ధ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లలకు వారి సంరక్షణ చాలా కీలకం. అయితే ఇది అప్పుడప్పుడు చేసే ఫోన్ కాల్స్, ఇంటి పనివాళ్లు లేదా అత్యవసర కాంటాక్ట్స్‌పైనే ఆధారపడే వ్యవస్థగా ఉండకూడదు. దీనికి సంబంధించి అన్వయా కిన్ కేర్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి కీలక సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు 70 ఏళ్లకు చేరుకునే ముందే ప్రతి కుటుంబం క్రమబద్ధమైన చెక్-ఇన్లు, స్థానిక సమన్వయం, ఇంటి భద్రతా ప్రణాళిక, స్పష్టమైన సంభాషణలు ఏర్పరచుకోవాలని వివరిస్తున్నారు.

భారతదేశంలో వృద్ధుల సంరక్షణ సవాలుగా మారింది. పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలు లేదా ఇతర దేశాలకు వెళ్తుండటంతో వృద్ధ తల్లిదండ్రులు తమ రోజువారీ పనులు, వైద్య అవసరాలకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. అలాగే భావోద్వేగ ఒత్తిడి, అత్యవసర పరిస్థితులను చాలాసార్లు స్వయంగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలా ఇటు దూరంగా ఉంటున్న పిల్లలు, అటు ఓల్డేజ్ పేరెంట్స్ ఇప్పటికీ ఫోన్ కాల్స్, ఇంటి పనివాళ్లు, పొరుగువారు, బంధువులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కానీ అన్వయా కిన్ కేర్ ఎండీ ప్రశాంత్ రెడ్డి ప్రకారం ఇలాంటి వ్యవస్థ ఇక సరిపోదట.

వృద్ధుల సంరక్షణ అనేది సమస్య వచ్చినప్పుడు భయంతో చేసే కాల్స్ నుంచి బయటకు వచ్చి, క్రమం తప్పని చెక్-ఇన్లు, అప్‌డేటెడ్ మెడికల్ సమాచారం, ఇంటి భద్రతా తనిఖీలు, స్థానిక సమన్వయం, అవసరమైన చోట టెక్నాలజీని కలిగిన నిర్మాణాత్మక వ్యవస్థగా మారాలని ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు. తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటే పిల్లలు ఏ విషయాలను గమనించాలి, ఇంటి పనివారిని ఎందుకు వృద్ధుల సంరక్షణగా భావించకూడదు, ఎన్‌ఆర్‌ఐలు సంక్షోభ సమయంలో వచ్చే ఆందోళనను ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే కంపెనీలు పిల్లల సంరక్షణ బాధ్యతను గుర్తించినట్లే వృద్ధుల సంరక్షణ ఒత్తిడినీ ఎందుకు గుర్తించాల్సి రావచ్చు అనే విషయాలను రెడ్డి వివరిస్తున్నారు.

ప్రశ్న: వృద్ధ తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటే మరో నగరం లేదా దేశంలో నివసించే పిల్లల కోసం ఆరోగ్యకరమైన చెక్-ఇన్ రూటీన్ ఎలా ఉండాలి?

ప్రశాంత్ రెడ్డి సమాధానం : అన్వయాలో మా డేటా ప్రకారం వృద్ధుల సంరక్షణలో కేవలం 30% మాత్రమే పూర్తిగా వైద్యానికి సంబంధించినది. మిగిలిన 70% స్నేహపూర్వక సహవాసం, రోజువారీ లాజిస్టిక్స్‌కు సంబంధించినది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ కంటే స్థిరత్వం ఎక్కువగా పనిచేస్తుంది. ప్రతి ఉదయం లేదా సాయంత్రం ఐదు నిమిషాల ఫోన్ కాల్ — చెక్‌లిస్ట్ అడగడానికి కాదు, కేవలం మాట్లాడటానికి — చాలా విషయాలు తెలియజేయగలదు. వాళ్లు ఎలా మాట్లాడుతున్నారు, తింటున్నారా, ఏదైనా తేడాగా అనిపిస్తున్నదా అనే విషయాలు తెలుస్తాయి.

కుటుంబాలు వారానికి ఒకసారి ఎలా ఉన్నారో స్వయంగా చూడాలి. ఎందుకంటే మీరు చూసేది కూడా చాలా ముఖ్యం. వారి కదలికలు, శక్తి, ఇల్లు బాగుందా లేదా అనే విషయాలను కేవలం వాయిస్ ద్వారా గుర్తించలేం. నెలకు ఒకసారి సంభాషణ కొంచెం లోతుగా వెళ్లాలి. మందులు, కొత్తగా ఏదైనా అసౌకర్యం, బయటకు వెళ్తున్నారా లేదా వంటి విషయాలపై మాట్లాడాలి.

మంచి రూటీన్‌లో ప్రతి రోజు వారి స్వరం వినడానికి ఒక చిన్న చెక్-ఇన్, వారానికి ఒక కాల్ ద్వారా విజువల్ సంకేతాలను గమనించడం, అలాగే ఒక స్థానిక ప్రొఫెషనల్ కేర్ మేనేజర్ ఉండాలి. స్మార్ట్ వాచీలు వంటి పాసివ్ టెక్ మానిటరింగ్ పరికరాలు నిరంతరం వైటల్స్‌ను ట్రాక్ చేస్తాయి. ఇవి తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తున్నారనే భావనకు లోనుకాకుండా, పిల్లలకు ఆబ్జెక్టివ్ డేటాను అందించగలవు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News : పేరు సుల్తాన్, బరువు 200 కిలోలు, ధర రూ.8 లక్షలు..: ఇది ఓ మేక ఇంట్రెస్టింగ్ స్టోరీ
Ambani Driver Salary: ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే, పైగా బోలెడన్ని బహుమతులు