టీవీ నటులు క్రికెట్‌ ఆడితే.. ఆ కిక్కే వేరప్పా.. జీతెలుగు సండే స్పెషల్‌

Published : Apr 01, 2021, 11:52 AM IST
టీవీ నటులు క్రికెట్‌ ఆడితే.. ఆ కిక్కే వేరప్పా.. జీతెలుగు సండే స్పెషల్‌

సారాంశం

జీ తెలుగు క్రికెట్‌ నిర్వహించబోతుంది. ఆడియెన్స్ కి సీరియల్స్ తో వినోదాన్నే కాదు, క్రికెట్‌తో ఉల్లాసాన్ని అందించబోతుంది. తాజాగా `జీ తెలుగు వారి పాట` పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐపీఎల్‌ తరహాలో వీరి గేమ్‌ సాగనుండటం విశేషం.   

క్రికెట్ కొన్ని కోట్ల మందికి ఒక విలువైన ఎమోషన్. అందరూ ఒక్కటై చూసే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్ మాత్రమే. అదే క్రికెట్ మన టెలివిజన్ నటీనటులు ఆడితే? ఆ ఆటే వేరు కదా? అలాంటి ఆటని మన ముందుకు తీసుకువస్తుంది జీ తెలుగు - 'జీ తెలుగు వారి పాట' అనే కార్యక్రమంతో మన అందరిని ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు అలరించబోతుంది. క్రికెట్ అంటే టీమ్స్ ఏంటి ఎవరు ఎలా ఆడతారు అనే కదా ఆలోచిస్తున్నారు? మన క్రికెట్ లీగ్ లో ఎలా అయితే ప్లేయర్స్ ని కొనుక్కుంటారో అలాగే ఇక్కడ మన కెప్టెన్స్ నిరుపమ్ మరియు కల్కి రాజా - సిద్ధార్థ్, విష్ణు ప్రియా, అమరదీప్, సింధూర, వసుధ, సత్య, సిరి, అనూష హెగ్డే, ప్రతాప్, ఆకర్ష్, పూజ, నవ్య, శ్రీ ప్రియా, సునంద, సిద్ధూ ఆర్టిస్ట్స్ ల నడుమ ఎవరు ఎవరని కొనుకుంటారు అని చూడాలి. అందరూ మంచి స్నేహితులు కానీ బరిలోకి దిగితే మాత్రం ఎవరికీ వారే సమవుజ్జీలు. మరి గెలుపు ఎవరిది?

అలాగే శ్రీముఖి ఈ షో కి యాంకర్ గా కూడా వ్యవహరించింది. ఈ క్రికెట్ కి కామెంటరీ ఇచ్చేందుకు మనందరికీ ఎంతో ఇష్టమైన సదం మరియు శ్రీముఖి సిద్ధమయ్యారు. ఈ ఆదివారం అందరిని అలరింపచేయడానికి స రి గ మ ప - ది నెక్స్ట్ సింగింగ్ విన్నర్ మరియు రన్నర్-అప్ యశస్వి, భరత్ వారి పాటలతో మంత్రముగ్ధుల్ని చేయగా సింగర్ కోమలి మరియు వారితో పాటు ఎన్నో అద్భుతమైన డాన్స్ పెరఫార్మన్సెస్ తోటి అందరిని ఉత్తేజపరుచనున్నారు మన నటీనటులు. ఇంతేనా అనుకోకండి, సదం- రియాజ్ మరియు పండు తన కామెడీ స్కిట్స్ తోటి అటు ప్రేక్షకులను ఇటు సెలెబ్రిటీలని కూడా కడుపుబ్బా నవ్వించబోతున్నారు.

మరి ఇంకా ఎందుకు ఆలస్యం, తప్పకుండా వీక్షించండి 'జీ తెలుగు వారి పాట ' ఈ ఆదివారం - సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే. మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?