‘సోలో బ్రతుకే సో బెటర్’ లాగానే నరేష్ ‘నాంది’ కూడా..

By Surya Prakash  |  First Published Jan 28, 2021, 9:21 AM IST


అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. నరేష్ తన రెగ్యులర్ స్టయిల్ కి భిన్నంగా చేసిన సినిమా ఇది. సీరియస్ రోల్, ఇప్పటికే  ‘నాంది’ టీజర్‌ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరిగిందని సమాచారం. అల్లరి నరేష్ కెరీర్ లోనే ఎక్కువ రేటుకు వెళ్లిన సినిమా ఇదే అని ట్రేడ్ అంటోంది. ఇంతకీ ఎంత పెట్టారు..ఎవరు తీసుకున్నారు అంటే...
 


అల్లరి నరేష్ నటించిన తాజా సినిమా బంగారు బుల్లోడు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ప్లాప్ అయ్యింది. వీకెండ్ లో కూడా వీలు చూసుకుని ఈ సినిమాకు వెళ్దామని అనుకోవటం లేదు. దాంతో మరీ దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్. దానికి తోడు నరేష్ కు సైతం ఈ సినిమా మీద పెద్దగా అంచనాలేనట్లు ఉన్నాయి. అందుకే సరిగా ప్రచారం కూడా చేయలేదు. ఆయన  దృష్టి మాత్రం నాంది మీద ఉంది. ఈ సినిమాపై అల్లరి నరేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. థియోటర్ లో రిలీజ్ అయితే తిరిగి తను ఫామ్ లోకి వస్తానని ఆశిస్తున్నారు. అదే జరుగుతోంది.  ఈ సినిమాని  జీ స్టూడియోస్ వాళ్ళు ఈ సినిమాను గుంపగత్తగా ఎనిమిదిన్నర కోట్లకు కొనేసినట్లు తెలుస్తోంది.

 ఇంతకు ముందు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమానుఇలాగే కొనేసిన జీ స్టూడియోస్ లాభం సంపాదించారు. దాంతో వాళ్లే ‘నాంది’ని కూడా కొన్నారట. రూ.8.5 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. త్వరలోనే అగ్రిమెంట్ పూర్తవుతుందని.. రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం. ఈ డీల్‌లో థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి ఉంటాయి.  ‘సోలో బ్రతుకే సో బెటర్’ తరహాలోనే ముందు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసి.. మరి కొన్ని రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వదులుతారని చెప్తున్నారు.

Latest Videos

ఇక సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ లాయర్‌ ఆద్య పాత్రలో నటిస్తుండగా, రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్‌ అనే పోలీస్‌ పాత్రలో హరిశ్‌ ఉత్తమన్‌, సంతోష్‌గా నటుడు ప్రవీణ్‌ కనిపించనున్నారు. లాక్‌డౌన్‌ కంటే ముందే ఎనభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.  ఈ చిత్రానికి కథ: తూమ్‌ వెంకట్‌, సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కూర్పు: చోటా కె.ప్రసాద్‌.

click me!