మిథాలీ రాజ్‌గా మారిపోయిన తాప్సీ.. మరో మైల్‌ స్టోన్‌ కోసం కసరత్తులు

Published : Jan 28, 2021, 08:27 AM IST
మిథాలీ రాజ్‌గా మారిపోయిన తాప్సీ.. మరో  మైల్‌ స్టోన్‌ కోసం కసరత్తులు

సారాంశం

మొన్నటి వరకు `రష్మీ రాకెట్‌` చిత్రం కోసం తీవ్రంగా శ్రమించింది తాప్సీ. ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడిపింది. ఎంత కఠినంగా తన బాడీని మౌల్డ్ చేసుకుందో వీడియోలు, ఫోటోల రూపంలో చూపించింది. ఇక ఆ సెషన్‌ పూర్తయ్యింది. ఇప్పుడు మరో సెషన్‌ స్టార్ట్ చేసింది. క్రికెటర్‌గా మారిపోయింది.

మొన్నటి వరకు `రష్మీ రాకెట్‌` చిత్రం కోసం తీవ్రంగా శ్రమించింది తాప్సీ. ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడిపింది. ఎంత కఠినంగా తన బాడీని మౌల్డ్ చేసుకుందో వీడియోలు, ఫోటోల రూపంలో చూపించింది. ఇక ఆ సెషన్‌ పూర్తయ్యింది. ఇప్పుడు మరో సెషన్‌ స్టార్ట్ చేసింది. క్రికెటర్‌గా మారిపోయింది. బ్యాట్‌ పట్టి బాల్‌ని బౌండరీలు దాటించే పనిలో బిజీ అయ్యింది. ఇండియా లేడీ క్రికెట్‌ టీమ్‌కి కెప్టెన్‌గానూ మారబోతుంది. ఇదంతా తాను నటిస్తున్న `శెభాష్‌ మిథు` చిత్రం కోసం. 

ఇది మహిళా టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న బయోపిక్‌. దీనికి రాహుల్‌ దోలాకియా దర్శకత్వంవహిస్తున్నారు. ఇందులో మిథాలీ రాజ్‌గా తాప్సీ నటిస్తుంది. రెండేళ్ల క్రితమే ఈసినిమాని ప్రకటించారు. కరోనా వల్ల, తాప్సీ ఇతర ప్రాజెక్ట్ ల వల్ల ఇది ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్నారు. అయితే ఫస్ట్ ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది తాప్సీ. దాదాపు సగం వర్క్ పూర్తయ్యిందని, ఇప్పుడు బ్యాట్‌, బాల్‌తో రొమాన్స్ స్టార్ట్ అయ్యిందని, చాలా దూరం వెళ్లాలని, ఇది మరో మైల్‌ స్టోన్‌లాంటి చిత్రమవుతుంద`ని పేర్కొంది. మిథాలీ చాలా కూల్‌ కెప్టెన్‌ అని తెలిపింది తాప్సీ. 

ఈ సందర్భంగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోని పంచుకుంది. ఇందులో ఇండియన్‌ జెర్సీ ధరించి, బ్యాట్‌ పట్టుకుని ఉంది తాప్సీ. బాల్‌ వైప్‌ ఏకాగ్రతతో చూస్తుంది. తాజా ఫోటో ఆకట్టుకుంటుంది. తాప్సీ ఈ సినిమాలతోపాటు `హసీనా దిల్‌ రూబా`, `జనగణమన`, `లూప్‌ లపేటా`తోపాటు మరో చిత్రంలో నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?