'యాత్ర' డేట్ మారింది.. ఎప్పుడంటే..?

Published : Sep 12, 2018, 06:25 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
'యాత్ర' డేట్ మారింది.. ఎప్పుడంటే..?

సారాంశం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ముందు నుండి ఈ సినిమాను జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ముందు నుండి ఈ సినిమాను జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు.

ప్రతిసారి ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తోంది చిత్రబృందం. కానీ ఇప్పుడు సినిమా సంక్రాంతి పోరు నుండి తప్పుకుంది. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేస్తూ రిలీజ్ డేట్ ని ప్రకటించింది చిత్రబృందం.

డిశంబర్ 21న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయబోతున్నారు. వైఎస్ పాదయాత్ర ప్రస్తావనగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్ ట్రైలర్ కి విశేష ప్రేక్షకాదరణ దక్కింది.  

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే