పెళ్లిరోజు నేను మా ఆయనకిచ్చే గిఫ్ట్ అదే.. సమంత కామెంట్స్!

By Udayavani DhuliFirst Published 12, Sep 2018, 5:39 PM IST
Highlights

అక్కినేని దంపతులు నాగచైతన్య, సమంత నటించిన సినిమాలు రేపే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సమంత 'యు టర్న్' కంటే చైతు 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అక్కినేని దంపతులు నాగచైతన్య, సమంత నటించిన సినిమాలు రేపే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సమంత 'యు టర్న్' కంటే చైతు 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు స్టార్లు రేపు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా ఏంటో తేల్చుకోబోతున్నారు.

అయితే సమంత తన 'యు టర్న్' సినిమాకు వీలైనంత ప్రచారం చేస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమంత తన భర్తకు పెళ్లిరోజున ఏం కానుక ఇవ్వబోతుందో చెప్పేసింది.

అక్టోబర్ 6న సమంత, చైతుల తొలి వివాహ వార్షికోత్సవం. ఆరోజు చైతన్యకి ఏం బహుమతి ఇవ్వబోతున్నారనే ప్రశ్న సమంతకి ఎదురుకాగా..దానికి సమాధానమిస్తూ.. ''మేమిద్దరం కలిసి నటించే సినిమా ఆరోజే సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఇదే మా ఆయనకి నేను ఇచ్చే తొలి పెళ్లిరోజు కానుక'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి..

రేపే విడుదల.. భర్తతో సమంత పోటీ!

ఆ రెండు సినిమాలు ఎందుకు చేశానా..? అనిపిస్తుంది: నాగచైతన్య కామెంట్స్!

Last Updated 19, Sep 2018, 9:24 AM IST