
నితిన్ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర టీమ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. హిందీలో విజయవంతమైన ‘అంధాధూన్’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. నభా నటేష్ హీరోయిన్. తమన్నా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు ఆగస్ట్ 23న సాయంత్రం 5గంటలకు ట్రైలర్ విడుదల చేసారు నిర్మాతలు. ట్రైలర్ లో మొత్తం స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం చేసారు. ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
‘సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ వీక్షకులను ఆకట్టుకుంది. ‘‘బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. నితిన్ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో ప్రకటిస్తాము’’అని నిర్మాతలు ప్రకటించారు.
ఇంట్రస్టింగ్ సీన్లతో ఈ ట్రైలర్ ఆద్యంతం అలరించేలా ఉంది. అంధుడిగా నితిన్ నటన మెప్పిస్తోంది. హీరోయిన్స్ గ్లామర్ ప్రదర్శన బాగా చేసారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక శ్రద్ద పెట్టి చేసారని అర్దమవుతోంది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. హీరోగా నితిన్‌కి ఇది 30వ చిత్రం.