ఇంట్రస్టింగ్ : ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ట్రైలర్

Surya Prakash   | Asianet News
Published : Aug 23, 2021, 05:22 PM IST
ఇంట్రస్టింగ్ : ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ట్రైలర్

సారాంశం

తన లైఫ్‌లో అమ్మకు.. అమ్మాయికి.. బైక్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ యువ నటుడు సుశాంత్‌ చెబుతున్నాడు. డి.దర్శన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ట్రైలర్ ను చిత్ర టీమ్ విడుదల చేసింది. 

సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది.  ఈ మూవీ ఆగస్ట్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు.  అందులో భాంగంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. మీరూ ఓ లుక్కేయండి.

నిర్మాతలు మాట్లాడుతూ..‘‘రెండో దశ కరోనా తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. మా చిత్రమూ అందరికీ వినోదం పంచుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’’అని సినీ వర్గాలు తెలిపాయి.  

సుశాంత్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్‌ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్‌, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, కృష్ణచైతన్య నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, సంభాషణలు: సురేష్‌-భాస్కర్‌, కళ: వి.వి.
 

PREV
click me!

Recommended Stories

Soundarya కి ఉన్న అరుదైన హ్యాబీ ఏంటో తెలుసా? ఖాళీ టైమ్‌లో ఆమె చేసి పని ఇదే
Illu Illalu Pillalu Today Episode Jan 22: విశ్వక్‌తో లేచిపోయి పెళ్లి.. గట్టి నిర్ణయం తీసుకున్న అమూల్య