డిసెంబర్‌లో పెళ్లికి ప్లాన్‌, అంతలోనే ఇలా.. సిద్ధార్థ్‌ శుక్లా అంత్యక్రియల్లో స్పృహ కోల్పోయిన ప్రియురాలు

Published : Sep 03, 2021, 09:19 PM IST
డిసెంబర్‌లో పెళ్లికి ప్లాన్‌, అంతలోనే ఇలా.. సిద్ధార్థ్‌ శుక్లా అంత్యక్రియల్లో స్పృహ కోల్పోయిన ప్రియురాలు

సారాంశం

తన ప్రియుడు హఠాన్మరణంతో సిద్ధార్థ్‌ ప్రియురాలు,నటి షెహనాజ్‌కి గుండె పగిలినంత పనైంది. ఆమె కన్నీరు మున్నీరవుతుంది. ఆమె సిద్ధార్థ్‌ మృతదేహం వద్ద విలపించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే సిద్ధార్థ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న షెహనాజ్‌ రెండు సార్లు స్పృహ కోల్పోయినట్లు సమాచారం.

బిగ్‌బాస్‌13 విన్నర్‌, నటుడు సిద్ధార్థ్‌ శుక్లా ఆకస్మిక మరణం బాలీవుడ్‌ని శోకసంద్రంలో ముంచేత్తింది. యంగ్‌ ఏజ్‌లో గుండెపోటుకి గురి కావడం అందరిని కలచివేస్తుంది. నేడు(శుక్రవారం ముంబయిలోని జుహులో సిద్ధార్థ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే తన ప్రియుడు హఠాన్మరణంతో సిద్ధార్థ్‌ ప్రియురాలు,నటి షెహనాజ్‌కి గుండె పగిలినంత పనైంది. ఆమె కన్నీరు మున్నీరవుతుంది. ఆమె సిద్ధార్థ్‌ మృతదేహం వద్ద విలపించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

అయితే సిద్ధార్థ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న షెహనాజ్‌ రెండు సార్లు స్పృహ కోల్పోయినట్లు సమాచారం. ఈ క్రమంలో సిద్ధార్థ్‌-షెహనాజ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సిద్ధార్థ్‌, షెహనాజ్‌ లవ్‌ స్టోరీ వైరల్‌ అవుతుంది. వీరిద్దరు బిగ్‌బాస్‌ 13లో కలుసుకున్న విషయం తెలిసిందే. హౌజ్‌లో వీరి లవ్‌ ట్రాక్‌ ఎంతగానో ఫేమస్‌ అయ్యింది. వీరి లవ్‌ స్టోరీ గురించి షో తర్వాత కూడా చర్చ జరిగింది. ఈ కపుల్‌కి సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. `సిద్ నాజ్‌`గా ఈ జోడీ పాపులర్‌ అయ్యింది.

దీనికి తోడు వీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారట. అంతలా ప్రేమలోకంలో విహరించిన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిశ్చయించుకుందట. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇరుకుటుంబాలు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో డిసెంబర్‌ 2021లో సిద్ధార్థ్‌-షెహనాజ్‌లు పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకున్నారట. అంతేకాదు వారి వివాహ వేధిక కోసం ప్లస్‌ ముంబై హోటల్‌ను మూడు రోజుల పాటు బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల గురించి షెహనాజ్‌-సిద్ధార్థ్‌లు తరచూ మాట్లాడుకునేవారట. 

ఈ క్రమంలో సిద్ధార్థ్‌ హఠాన్మరణం ఈ రెండు కుటుంబాల్లో ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో వర్ణించలేనిది. సిద్ధార్థ్‌తో జీవితాన్ని పంచుకోవాలని కోటీ ఆశలతో ఉన్న షెహనాజ్‌ ఇప్పుడు ఎలాంటి గడ్డు పరిస్థితులను చూస్తుందో తలచుకుంటూనే గుండె బరువేక్కుతోంది. ఇది విని ఈ జంట అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌