నాకు అవకాశాలివ్వడం కాదు.. నేనే ఇస్తానంటోన్న బాంబే బ్యూటీ మిత్ర శర్మ

Published : May 23, 2021, 06:40 PM IST
నాకు అవకాశాలివ్వడం కాదు.. నేనే ఇస్తానంటోన్న బాంబే బ్యూటీ మిత్ర శర్మ

సారాంశం

సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ఛాన్సులు రాలేదు. దీంతో తనకు అవకాశాలివ్వడం కాదు.. తానే పది మందికి ఛాన్సులిస్తానంటోంది బాంబే బ్యూటీ మిత్ర శర్మ.

సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ఛాన్సులు రాలేదు. దీంతో తనకు అవకాశాలివ్వడం కాదు.. తానే పది మందికి ఛాన్సులిస్తానంటోంది బాంబే బ్యూటీ మిత్ర శర్మ. ఈ అమ్మడు తెలుగులో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం `బాయ్స్`. విడుదలకు రెడీ అవుతుంది. చేతిలో రూపాయ్ కూడా లేకుండా బాంబే నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన మిత్ర శ‌ర్మ‌ ఎన్నో ఒడిదిడుకుల ఎదుర్కొని, న‌టిగా ఆ త‌రువాత సినిమా మ‌క్కువతో నిర్మాత‌గా మారి తెర‌కెక్కించిన సినిమా `బాయ్స్`, మిత్ర నిర్మాత‌గా తెర‌కెక్కించిన ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌నల్ కంటెంట్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ ట్రెండ్ అవుతుంది. 

మరోవైపు రేపు(మే 24) సోమవారం పుట్టిన రోజు జరుపుకుంటోందీ ఈ అందాల భామ. బాంబేలో పుట్టి పెరిగిన మిత్ర‌ వాస్త‌వానికి నార్ అమ్మాయి అయిన‌ప్ప‌టికీ తెలుగు మాత్రం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గలదు. సినిమా మీద మక్కువుతో కొంద‌రు స‌న్నిహితులు ఇచ్చిన స‌ల‌హాతో బాంబే నుంచి హైద‌రాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక్క‌డకు వ‌చ్చిన త‌రువాత అనేక సినిమా ఆఫీసులు చుట్టూ అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నం చేసి, స‌రైన ఆఫ‌ర్లు కోసం ప్ర‌య‌త్నం చేసేకంటే తానే న‌లుగురికి అవ‌కాశం ఇచ్చి వారిలో ఉన్న ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌పెట్టుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ శ్రీపిక్చ‌ర్స్ అనే సినీ నిర్మాణ సంస్థ‌ను స్థాపించింది.  నూత‌న తారాగ‌ణంతో `బాయ్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. 

ఇందులో తాను కూడా ఓ హీరోయిన్ గా న‌టించింది. యూతుఫుల్ కాలేజ్ ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది. దీనికి సంబంధించిన ఆడియో నుంచి తాజాగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాహుల్ సిప్లీగంజ్ పాడిన హేరాజా అనే పాట యూట్యూబ్ లో మిలియ‌న్ వ్యూస్ కి పైగా ద‌క్కించుకుని, సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వినూత్న‌మైన ప్ర‌య‌త్నాల్ని ఎల్ల‌ప్పూడు తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూ ఉంటారు, ఆ న‌మ్మ‌కంతోనే తాను క‌ష్ట‌ప‌డి సంపాదించిన ప్ర‌తి రూపాయ్ ఖ‌ర్చుపెట్టి `బాయ్స్` చిత్రాన్ని నిర్మించిన‌ట్లుగా తెలిపారు యువ నిర్మాత న‌టి మిత్ర‌శ‌ర్మ‌. చేసే ప‌ని మీద గౌవ‌రం ఉంటే అదే మ‌నకి పేరు, డ‌బ్బు సంపాదించిపెడుతుంద‌ని చెబుతుంది మిత్ర‌శ‌ర్మ‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?