ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ ఏవీఎన్‌ మూర్తి ఇకలేరు

Published : May 23, 2021, 05:02 PM IST
ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ ఏవీఎన్‌ మూర్తి ఇకలేరు

సారాంశం

టాలీవుడ్‌లో వరుస మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. పీఆర్వో, నిర్మాత, సినీ జర్నలిస్ట్ బి.ఏ.రాజు, ఎడిటర్‌ జయరాం, నిర్మాత విశ్వేశ్వరరావు ఇటీవల కన్నుమూశారు. తాజాగా ప్లే బ్యాక్‌ సింగర్‌ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. 

కరోనా కారణంగా, అనారోగ్య కారణాలతో ఇటీవల వరుసగా సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం,  హిందీ భాషల్లో వరుస మరణాలతో తీవ్ర విషాదాలను నెలకొంటున్నాయి. దర్శకుడు కె. వి ఆనంద్‌, వివేక్‌, బి.ఏ రాజు, ఇతర యువ దర్శకులు, అలాగే హిందీలో సంగీత దర్శకులు రామ్‌లక్ష్మణ్‌, నటుడు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. 

పీఆర్వో, నిర్మాత, సినీ జర్నలిస్ట్ బి.ఏ.రాజు, ఎడిటర్‌ జయరాం, నిర్మాత విశ్వేశ్వరరావు ఇటీవల కన్నుమూశారు. తాజాగా తెలుగు ప్లేబ్యాక్‌ సింగర్‌ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆయన ప్లేబ్యాక్‌ సింగర్‌గా అనేక సినిమాలకు పాటలు పాడారు. తనదైన గాత్రంతో శ్రోతలను మెప్పించారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ