పెళ్లి చేసుకోమని నెటిజన్ సలహా... షాకింగ్ కౌంటర్ ఇచ్చిన నవదీప్... ఏమన్నాడంటే..?

Published : Jan 24, 2022, 06:38 AM IST
పెళ్లి చేసుకోమని నెటిజన్ సలహా... షాకింగ్ కౌంటర్ ఇచ్చిన నవదీప్... ఏమన్నాడంటే..?

సారాంశం

సోషల్ మీడియాలో నెటిజన్లకు ఫన్నీ కౌంటర్స్ ఇవ్వడం ఓ ఆర్ట్.. అది అందరు సెలబ్రిటీలకు రాదు. కొంత మంది స్టార్స్..నెటిజన్లు ఏమన్నా కామ్ గా ఉంటారు. మరికొంత మంది మాత్రం కౌంటర్ ఇవ్వకుండా ఉండలేదు. అలాంటి వారిలో యంగ్ హీరో నవదీప్ కూడా ఒకరు.

సోషల్ మీడియాలో నెటిజన్లకు ఫన్నీ కౌంటర్స్ ఇవ్వడం ఓ ఆర్ట్.. అది అందరు సెలబ్రిటీలకు రాదు. కొంత మంది స్టార్స్..నెటిజన్లు ఏమన్నా కామ్ గా ఉంటారు. మరికొంత మంది మాత్రం కౌంటర్ ఇవ్వకుండా ఉండలేదు. అలాంటి వారిలో యంగ్ హీరో నవదీప్ కూడా ఒకరు.

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ హీరోలలో నవదీప్‌(Navdeep) కూడా ఒకరు.ఒక టైమ్ లో వరుసగా ప్రేమ సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా గడిపేశాడు నవదీప్. ఆ సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ కూడా సాధించాడు. కాని మన టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ వస్తే.. మూవీ కెరరీ అయిపోయినట్టే. ఇది చాలా సార్లు చాలా హీరోల విషయంలో జరిగింది. ఇక ఇప్పుడు మన నవదీప్ కూడా హీరోగా అవకాశాలు లేక ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాలు చేసుకుంటున్నాడు.

 

ఆ మధ్య అల వైకుంఠపురములో  సినిమాలో అల్లు అర్జున్(Alu Arjun) ఫ్రెండ్‌గా నటించాడు నవదీప్(Navdeep). ఈ సినిమా తరువాత నవదీప్ కు పెద్దగ సినిమా పడింది లేదు. రీసెంట్ గా  అంటే.. మోసగాళ్లు సినిమాలో విష్ణు స్నేహితుడిగా కనిపించారు. ప్రస్తుతం సన్నీ లియోని లీడ్ రోల్ చేస్తున్న వీర‌మాదేవి సినిమాలో ఓఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు నవదీప్(Navdeep). అడపా దడపా ఇలా క్యారెక్టర్ రోల్స్ చేయడం తప్పించి హీరోగా మాత్రం నవదీప్ ఫెయిడ్ అవుట్ అయ్యాడనే చెప్పాలి.

ఇక టాలీవుడ్ లో అందరు బ్యాచిలర్ హీరోల మాదిరి మనోడికి కూడా 35 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లి విషయంలో మాత్రం ఇంకా టైమ్‌ ఉంటుంది అంటూ రోటీన్ డైలాగ్ చెపుతూ వస్తున్నాడు. అయితే ఎవరు వదిలిపెట్టినా.. సెలబ్రిటీలను ఈ విషయంలో సోషల్ మీడియా వదిలిపెట్టదుగా..అలవాటుగానే  నెటిజన్స్‌ ఇంకెప్పుడు పెళ్లి బాబు..అంటూ ప్రతిసారి అడగడం.. వాటికి నవదీప్ కూడా చాలా ఫన్నీగా ఆన్సర్స్ ఇవ్వడం జరిగిపోతూనే ఉంటుంది. అయితే ఈసారి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ డిఫరెంట్ గా  నవదీప్‌(Navdeep)  పెళ్లి టాపిక్ ఎత్తాడు.

ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..గ‌డ్డం నెరిసిపోతుంది.. ఇప్పటికైనా పెళ్లి చేసుకో బాసూ టూ.. సలహా ఇచ్చాడు. మన నవదీప్(Navdeep)  కామ్ గా ఉంటాడా.. ఆ  నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. అన్నా గెడ్డం తెల్లబడుతోంది పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా అని నవదీప్‌ కౌంటర్‌ ఇచ్చాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్