నమ్రతకి మహేష్‌ భయపడతాడా?.. అదేంటి బాలయ్యకి అలా చెప్పాడు?

Published : Jan 23, 2022, 11:11 PM IST
నమ్రతకి మహేష్‌ భయపడతాడా?.. అదేంటి బాలయ్యకి అలా చెప్పాడు?

సారాంశం

మహేష్‌కి ఇప్పుడు అన్నీ నమ్రతనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహేష్‌ అనే ఇమేజ్‌కి బ్యాక్‌ బోన్‌ నమ్రత అని అంతా చెబుతుంటారు. మరి అలాంటి నమ్రతకి మహేష్‌ భయపడతాడా? 

మహేష్‌బాబు(Mahesh), నమ్రత(Namrata) ప్రేమించుకున్న పెళ్లిచేసుకున్నారు. ఏజ్‌లో తనకంటే పెద్దే అయినా నమ్రతని `వంశీ` సినిమా టైమ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మహేష్‌. తన మ్యారేజ్‌కి కృష్ణ అంగీకరించకపోవడంతో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు ఉంది నమ్రత. ఇప్పుడు మహేష్‌కి సంబంధించి అన్ని చూసుకుంటుంది నమ్రత. ఓ వైపు మహేష్‌ కాల్షీట్లు, మరోవైపు ఆయన పారితోషికం, ఇంకో వైపు ప్రొడక్షన్‌, మరోవైపు మల్టీప్లెక్స్ , అలాగే క్లాత్స్ వేర్స్ కి సంబంధించిన బిజినెస్‌లు, వీటితోపాటు మహేష్‌ ప్రకటనలు ఇలా అన్ని నమ్రత ఒంటిచేత్తో మ్యానేజ్‌ చేస్తుంది. 

ఇవన్నీంటితోపాటు తమ పిల్లలు గౌతమ్‌, సితార పెంపకం ఇలా అన్నీ చూసుకుంటుంది నమ్రత. ఇంకా చెప్పాలంటే మహేష్‌కి ఇప్పుడు అన్నీ నమ్రతనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహేష్‌ అనే ఇమేజ్‌కి బ్యాక్‌ బోన్‌ నమ్రత అని అంతా చెబుతుంటారు. మరి అలాంటి నమ్రతకి మహేష్‌ భయపడతాడా? అంటే అవుననే టాక్‌ వినిపిస్తుంది. అంతేకాదు, ఇదే విషయాన్ని మహేష్‌ ఓ షోలో చెప్పడం విశేషం. మహేష్‌ ఇటీవల బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా ప్రసారమవుతున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే`(Unstoppable) షోలో పాల్గొన్నారు. ఈ ప్రోమో ఇటీవల విడుదలైంది. మహేష్‌ గెస్ట్ గా ఈ సీజన్‌ పూర్తి కాబోతుంది. ఫిబ్రవరి 4న ఇది `ఆహా`లో ప్రసారం కానుంది. 

తాజాగా ఈ ఎపిసోడ్‌ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో Mahesh ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. `నమ్రత గురించి బాగా చెప్పావ్‌. తను కూడా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది` అని బాలయ్య చెప్పగానే మహేష్‌..ఏంటి అని క్యూరియాసిటీ ప్రదర్శించారు. అయితే నమ్రత అనగానే బాడీలో డిసిప్లెయిన్‌ వచ్చేసిందని బాలయ్య చెప్పడంతో, మంచిదే అయ్యి ఉంటుందని, ఇప్పుడు ఇంటికెళ్లాలి సర్‌. ఎందుకవన్నీ గొడవలు` అంటూ మహేష్‌ సరదాగా చెప్పడం నవ్వులు పూయించింది. అయితే దీనికి నెటిజన్లు మరింత పోప్‌ యాడ్‌ చేస్తున్నారు. మహేష్‌.. నమ్రతకి భయపడతారా? అనే కాంటెస్ట్ ని స్టార్ట్ చేశారు. ఇది వైరల్‌ కావడం విశేషం. 

ఇదిలా ఉంటే ఇందులో మరికొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు మహేష్‌. `ఎవరు క్యాట్‌, ఎవరు బ్రాట్‌` అని బాలయ్య అడగ్గా, గౌతమ్‌ క్యాట్‌, సితార బ్రాట్‌. తాటా తీసేస్తది అని తెలిపారు మహేష్‌. మరోవైపు కేబీఆర్‌ పార్క్ కి సంబంధించిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు మహేష్‌. పార్క్ లో వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా పామ్‌ కనిపించిందట. దాన్ని చూసిన మహేష్‌ భయపడిపోయి వెనక్కి ఐదు కిలోమీటర్లు పరిగెత్తి ఇంటికి వెళ్లిపోయాడట. ఆ రోజు నుంచి మళ్లీ కేబీఆర్‌ పార్క్ కి వెళ్లేదని తెలిపారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

మరోవైపు ప్రస్తుతం మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బ్యాంక్‌ కుంభ కోణాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ ఆగిపోయింది. ఇటీవల మహేష్‌, కీర్తిసురేష్‌ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దీంతో షూటింగ్‌ని నిలిపివేశారు. త్వరలోనే ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 1న విడుదల చేయబోతున్నారు. అయితే వాయిదా పడే ఛాన్స్ ఉందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే