రెండు రోజుల్లో స్నేహితులైన ఇద్దరు యంగ్ మోడల్స్ సూసైడ్... షాకింగ్ విషయాలు వెల్లడించిన తల్లి!

Published : May 27, 2022, 03:15 PM IST
రెండు రోజుల్లో స్నేహితులైన ఇద్దరు యంగ్ మోడల్స్ సూసైడ్... షాకింగ్ విషయాలు వెల్లడించిన తల్లి!

సారాంశం

బెంగాలీ మోడల్ మంజూష నియోగి మే 27 శుక్రవారం ఆత్మహత్య చేసుకొని మరణించారు. కాగా మంజుష తల్లి తన కూతురు ఆత్మహత్యకు కారణాలు వివరించారు. దీనికి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న మరొక నటి మోడల్ బిదీషా ది మజుందార్ కారణం అంటున్నారు. 

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మోడల్స్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడిన మంజూష నియోగి (Manjusha Niyogi), బిదీషా స్నేహితులు కావడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. తన కూతురు మంజూష ఆత్మహత్యకు గల కారణాలు తల్లి వివరించారు. బిదీషా-మంజూష మంచి స్నేహితులు. నాకుతూరు మంజూష తన ఫ్రెండ్ బిదీషాతో కలిసి జీవించాలి అనుకుంది. ఎప్పుడూ తన గురించే మాట్లాడుతూ ఉండేది. ఇది నచ్చని నేను మంజూషను మందలించాను. 

తాను ఎంతగానో ప్రేమించిన బిదీషా ఆత్మహత్య చేసుకోవడంతో మంజూష తట్టుకోలేకపోయింది. నేను కూడా సచ్చిపోతానని మంజూష నాతో ముందుగానే చెప్పిందంటూ ఇండియా టుడేతో మంజూష తల్లి వివరించారు. మంజూష నేడు తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 

మే 25న  బిదీషా (BIDISHA DE MAJUMDAR) కలకత్తా లోని దమ్ దమ్ ఏరియాలో గల అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత నాలుగు నెలలుగా బిదీషా ఆ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్నారు. అనుమానం రావడంతో అపార్ట్మెంట్ తలుపులు బద్దలుకొట్టి చూడగా బిదీషా ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని తెలుస్తుంది. అనుభవ్ బేరా అనే వ్యక్తిని బిదీషా ప్రేమిస్తున్నారు. ఈ రిలేషన్ లో వచ్చిన విబేధాలు ఆమెను డిప్రెషన్ లోకి నెట్టాయని, ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పాయని సన్నిహితులు చెబుతున్నారు. 

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు యంగ్ మోడల్స్ మరణించడం సంచలనంగా మారింది. వీరి మృతి పట్ల పరిశ్రమ వర్గాలు, సన్నిహితులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ కోసం ఒకరు, స్నేహం కోసం మరొకరు ఉసురు తీసుకున్నారు.  

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు