కమల్ విశ్వరూపం, సిగ్నేచర్ స్టెప్ తో అదరగొట్టిన లోకనాయకుడు, విక్రమ్ తెలుగు సాంగ్ రిలీజ్

Published : May 27, 2022, 04:03 PM IST
 కమల్ విశ్వరూపం, సిగ్నేచర్ స్టెప్ తో అదరగొట్టిన లోకనాయకుడు, విక్రమ్ తెలుగు సాంగ్ రిలీజ్

సారాంశం

చాలా కాలం తరువాత డాన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఈసారి మాస్ బీట్ తో అలరించాడు. ఫ్యాన్స్ తో పాటు కాలు కదిపి దుమ్మురేపాడు.   

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ విక్రమ్. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. విక్రమ్ మూవీకి  సంగీత దర్శకుడు అనిరుద్ సాలిడ్ గా మ్యూజిక్ అందించారు. తమిళ్ వెర్షన్ లో సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. ఇక తెలుగులో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. 

ఇక ఇప్పుడు తెలుగులో కూడా ఫస్ట్ సింగిల్ ని తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేశారు. తమిళ్ లో కమల్ రాసి పాడిన ఈ సాంగ్ ని తెలుగులో చంద్రబోస్ మంచి మాస్ అండ్ క్యాచీ లిరిక్స్ రాయగా.. తెలుగులో కూడా కమల్ హాసన్ స్వయంగా ఈ సాంగ్ ని   పాడారు. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈపాట.. సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. 

 

సాంగ్ లో విజ్యువల్స్ లో లోకేష్ కనగరాజ్ మార్క్ స్పస్టంగా కనిపిస్తుంది. ఆ మధ్య విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన లోకేష్.. ఆయనతో సిగ్నేచర్ స్టెప్పులే వేయించాడు. ఈసారి కమల్ హాసన్ తో కూడా కొత్తగా మాస్ స్టెప్స్ వేయించాడు. అది కూడా తన ఫ్యాన్స్ మధ్య .. హీరోను ఫాలో అవుతూ.. చూసే అభిమానుల పల్స్ ను క్యాచ్ చేసేలా  సాంగ్ ను డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. మరి ఈసాంగ్ కు తెలుగులో ఇంకెంత రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. 
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు