పవన్ కి మద్దతుగా యంగ్ హీరో.. ఇది నా బాధ్యత అంటూ కామెంట్స్

Published : Sep 26, 2021, 05:35 PM ISTUpdated : Sep 26, 2021, 05:38 PM IST
పవన్ కి మద్దతుగా యంగ్ హీరో.. ఇది నా బాధ్యత అంటూ కామెంట్స్

సారాంశం

వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై క్రమంగా మద్దతు పెరుగుతోంది. పవన్ కామెంట్స్ ని వైసిపి నేతలు విమర్శలతో తిప్పికొడుతున్నారు. కానీ చిత్ర పరిశ్రమ నుంచి నెమ్మదిగా సపోర్ట్ అందుతోంది.

వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై క్రమంగా మద్దతు పెరుగుతోంది. పవన్ కామెంట్స్ ని వైసిపి నేతలు విమర్శలతో తిప్పికొడుతున్నారు. కానీ చిత్ర పరిశ్రమ నుంచి నెమ్మదిగా సపోర్ట్ అందుతోంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పవన్ కి మద్దతుగా ట్వీట్స్ చేశారు. 

తాజాగా మరో యంగ్ హీరో పవన్ చేసిన వ్యాఖ్యలని పూర్తిగా సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ హీరో మరెవరో కాదు ఆర్ఎక్స్ 100 చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ. కార్తికేయ ప్రస్తుతం హీరోగా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. 

కార్తికేయ పవన్ కి మద్దతుగా చేసిన ట్వీట్ పరిశీలిస్తే.. నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు అలాగే వ్యతిరేకిని కూడా కాదు. కానీ చిత్ర పరిశ్రమ సమస్యల గురించి పవన్ కళ్యాణ్ సర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థవంతమైనవి. ఆయన ఇండస్ట్రీ తరుపున మాట్లాడారు. మనందరి తరుపున మాట్లాడిన పవన్ కళ్యాణ్ సర్ కి మద్దతు ఇవ్వడం నా బాధ్యత' అని కార్తికేయ ట్వీట్ చేశారు. 

నిర్మాతల కష్టార్జితం, నటీనటుల కష్టంతో తెరకెక్కే చిత్ర పరిశ్రమని ఏపీ ప్రభుత్వం కంట్రోల్ చేయడం ఏంటి అంటూ పవన్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. పవన్ ఆన్లైన్ టికెట్స్ విధానాన్ని తప్పు బట్టారు. ఈ సందర్భంగా పవన్ వైసిపి ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు