క్రేజీ కాంబో... విజయ్ తో భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన దిల్ రాజు-వంశీ పైడిపల్లి

Published : Sep 26, 2021, 05:14 PM IST
క్రేజీ కాంబో... విజయ్ తో భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన దిల్ రాజు-వంశీ పైడిపల్లి

సారాంశం

దర్శకుడు వంశీ పైడిపల్లి(Vamshi paidipalli) దర్శకత్వంలో విజయ్(Vijay) తన తదుపరి చిత్రం ఓకే చేశారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) భారీగా తెరకెక్కించనున్నారు.

వరుస విజయాలతో సూపర్ ఫార్మ్ లో ఉన్న దళపతి విజయ్ తన నెక్స్ట్ మూవీపై అధికారిక ప్రకటన చేశారు. తెలుగులో కూడా ఫేమ్ రాబట్టిన విజయ్ ఈసారి స్ట్రైట్ తెలుగు చిత్రానికి సైన్ చేశారు. మహర్షి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రం ఓకే చేశారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీగా తెరకెక్కించనున్నారు. 


ముగ్గురు స్టార్స్ ఏకమైన ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇక 2022లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో బీస్ట్ మూవీలో నటిస్తున్నారు విజయ్. షూటింగ్ చివరి దశలో ఉండగా, సంక్రాంతి కానుకగా విడుదల కానుందని వినికిడి. కాబట్టి వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లే సూచనలు కలవు. 


గతంలోనే తాను విజయ్ తో మూవీ చేయనున్నట్లు వంశీ పైడిపల్లి తెలియజేశారు. నేడు ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. 2019లో విడుదలైన మహర్షి చిత్రం తరువాత వంశీ పైడిపల్లి మరో చిత్రం చేయలేదు. ఆయన మహర్షి తరువాత మరలా మహేష్ తోనే చేయాల్సి ఉండగా, అనుకోని కారణాల వలన ఆ మూవీ వాయిదా పడింది. ఇక విజయ్ మొదటిసారి తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తున్నారన్న ప్రకటనతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు