
ఒకేసారి రెండు క్లిష్టమైన పనులు చేయడం అంత సులువు కాదు. అందులోనూ వాటిని విజయవంతంగా పూర్తి చేయడం అంటే మాటలు కాదు. యంగ్ బ్యూటీ శ్రీలీల 'పెళ్లి సందD' చిత్రంతో మెరుపులా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీలీల గ్లామర్, అద్భుతమైన పెర్ఫామెన్స్ తోనే యావరేజ్ మూవీ అయిన పెళ్లి సందD విజయం సాధించింది అని చాలా మంది సినీ విమర్శకులు అభిప్రాయ పడ్డారు.
శ్రీలీల గ్లామర్, పెర్ఫామెన్స్ తో తొలి చిత్రంలోనే యువత ఫిదా కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. శ్రీలీల ప్రస్తుతం రవితేజ సరసన ధమాకా మూవీలో నటిస్తోంది. అలాగే త్రివిక్రమ్, మహేష్ బాబు మూవీలో కూడా సెకండ్ హీరోయిన్ రోల్ కోసం శ్రీలీల వినిపిస్తోంది.
ఒకవైపు శ్రీలీల సినిమాలో హీరోయిన్ గా రాణిస్తూనే తన విద్యాభ్యాసం కూడా పూర్తి చేస్తోంది. హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాక తమ చదువులని చాలా మంది హీరోయిన్లు మధ్యలోనే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీలీల మాత్రం అలా కాదు. శ్రీలీల ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత కూడా శ్రీలీల ఎంబిబిఎస్ కంటిన్యూ చేసింది.
శ్రీలీల రీసెంట్ గా ఎంబిబిఎస్ విద్యని పూర్తి చేసింది. ఇటీవల ఫైనల్ ఇయర్ పరీక్షలు జరగగా అందులో శ్రీలీల మంచి శాతంతో పాస్ అయింది. సో ఆమె ఇప్పుడు డాక్టర్. త్వరలో శ్రీలీల ఎంఎస్ పూర్తి చేసేందుకు కూడా ప్లాన్ చేసుకుంటోందట. సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయంగా కెరీర్ ని సెట్ చేసుకోవాలని శ్రీలీల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ హీరోయిన్ గా అవకాశాలు తగ్గితే డాక్టర్ వృత్తిలో కొనసాగవచ్చు అనేది ఆమె తల్లి సలహా అట. ఏది ఏమైనా శ్రీలలకు టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.