Ranveer Singh: బప్పి లహిరికి ‘రణ్ వీర్ సింగ్’ నివాళి.. త్రో బ్యాక్ పిక్స్, వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్

Published : Feb 17, 2022, 02:19 PM IST
Ranveer Singh: బప్పి లహిరికి ‘రణ్ వీర్ సింగ్’  నివాళి..  త్రో బ్యాక్ పిక్స్, వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్

సారాంశం

బాలీవుడ్ కు డీజే కల్చర్ పరిచయం చేసిన బప్పి  లహిరి(Bappi Lahiri).. బాలీవుడ్ స్టార్స్ కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించాడు. తాజాగా నటుడు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) బప్పి డాతో తనకున్న మెమోరీస్ ను గుర్తు తెచ్చుకున్నాడు.  త్రో బ్యాక్ పిక్స్, వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్  అయ్యాడు.      

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరికి బాలీవుడ్ నటుడు 
రణ్ వీర్ సింగ్ మరోసారి హృదయపూర్వక నివాళి అర్పించారు. ఈ  మేరకు తాజాగా సోషల్ మీడియాతో బప్పి  డాతో తనకున్న అనుబంధాన్ని  తెలిపే త్రో బ్యాక్ పిక్స్, వీడియోస్ ను తన అభిమానులతో పంచుకున్నాడు.   అప్పటికే బప్పి లహిరిగా రణ్ వీర్ సింగ్ వీర అభిమాని. కాగా ఆ డిస్కో కింగ్‌తో చిరస్మరణీయ క్షణాలను రణ్ వీర్ గుర్తు  చేసుకున్నాడు.  

బప్పి లాహిరి అనారోగ్యంతో నిన్న తుది శ్వాస విడవడంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్... ఇతర చలన చిత్ర పరిశ్రమల ప్రముఖులు షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికన ఆయనకు ఘన నివాళి అర్పించారు. బప్పి డాతో వారికి అనుబంధాన్ని నెటిజన్లతో పంచుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మెగా స్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలక్రిష్ణ  కూడా సంతాపం ప్రకటించారు. బప్పి లాహిరి అంత్యక్రియలు నిన్న విలే పార్లే శ్మశానవాటికలో జరిగాయి. ఈ సందర్భంగా  అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు స్నేహితులు వేలాది తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.  

 

తాజాగా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, బప్పీ డా వీరాభిమాని మరోసారి బప్పి లహిరికి   హృదయపూర్వక నివాళి అర్పించారు. కాగా రణ్ వీర్ పోస్ట్ చేసిన  ఫొటోల్లో ట్రెండీ వేర్ లో, స్లైలిష్ లుక్ లో బప్పి లహిరి, రణ్ వీర్ ఆకట్టుకుంటున్నారు. మరో వీడియోలో బప్పీ లహిరికి బాల్యం నుంచే  సంగీతంపై ఎంత శ్రద్ధ ఉండేదో  రణ్ వీర్ వివరిస్తుంటాడు.  ఈ త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ పోస్ట్  చేస్తూ రణ్ వీర్ ఒక నోట్ రాశారు. ‘బప్పి  లహిరి లాంటి వారు ఇప్పటి వరకు లేరు, భవిష్యత్ లోనూ ఉండబోరు.  బప్పి డా ఎప్పటికీ జీవించే ఉంటాడు. మంచి సంగీతం, మధుర క్షణాలను అందించినందుకు ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.  

 అయితే బప్పి లహిరి జీవితంపై బయోపిక్ తీయాలని పలువురు డైరెక్టర్లు   2019లోనే బప్పి లహిరిని సంప్రదించారు. కానీ అప్పుడు లహిరి ఎటూ తేల్చలేదు. కానీ  తన బయోపిక్‌ తీయాల్సి  వస్తే రణ్‌వీర్‌ సింగ్  తన చిన్నప్పటి పాత్రలో నటించాలని కోరుకున్నాడు.  బప్పీ కూడా ఒక వేదికపై మాట్లాడుతూ ‘నటుడు రణవీర్ సింగ్ బహుశా నా చిన్నప్పటి వెర్షన్‌ను ప్లే చేయగలడు.. మీకు 1970లు, 80 మరియు 90ల కాలం తెలుసు’ కాదా అంటూ రవీణ్ తో  మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించారు. 


 

PREV
click me!

Recommended Stories

150 కోట్ల ఇల్లు, 7 కోట్ల కారు, రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి ఎంత? రెమ్యునరేషన్ వివరాలు?
చీరకట్టులో ప్రభాస్ హీరోయిన్, కుందనపు బొమ్మ నిధి అగర్వాల్.. వైరల్ ఫోటోషూట్