కారు ప్రమాదంలో యువనటి మృతి!

Published : May 24, 2023, 12:05 PM ISTUpdated : May 24, 2023, 12:10 PM IST
 కారు ప్రమాదంలో యువనటి మృతి!

సారాంశం

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువనటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో మరణించింది. ఈ ఘటన అభిమానులను తీవ్ర వేదనకు గురి చేస్తుంది. 

యువనటి అకాల మరణం బాలీవుడ్ లో విషాద ఛాయలు నింపింది. పలు సీరియల్స్ లో నటించిన వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో మరణించింది. వైభవి ఉపాధ్యాయ ప్రయాణిస్తున్న కారు లోయలో పడటంతో ఆమె అక్కడిక్కకే మృతి చెందారు. వైభవికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మంగళవారం ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అక్కడ హిల్ స్టేషన్స్ సందర్శించారు. ట్రిప్ ముగించుకుని వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలో పడింది. 

ఈ ప్రమాదంలో వైభవి అక్కడిక్కడే మృతి చెందారని సమాచారం. ఆమె ప్రియుడు మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైభవి మృతి వార్త తెలిసిన వెంటనే ఆమె సోదరుడు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముంబైకి వైభవి మృతదేహం తరలించారు. నేడు వైభవి అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. 

వైభవికి సారాభాయ్ వెర్సెస్ సారాభాయ్ సీరియల్  ఫేమ్ తెచ్చి పెట్టింది. అలాగే మరికొన్ని సీరియల్స్ లో ఆమె నటించారు. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఛప్పక్ మూవీలో వైభవి ఓ పాత్ర చేసింది. ఈ మూవీలో దీపికా యాసిడ్ దాడి బాధితురాలిగా నటించిన విషయం తెలిసిందే. వైభవి వయసు 32 ఏళ్ళు. అభిమానులు, సన్నిహితులు, పరిశ్రమ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాయి. 
వైభవి ఉపాధ్యాయ, 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?