`దేవర` సినిమాతో బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమాలో పెద్ద ఎన్టీఆర్‌కి భార్యగా నటించిన శృతి గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
ఎన్టీఆర్ హీరోగా నటించిన `దేవర` చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా కాసుల వర్షం కురిపిస్తుంది. దీనికి మిశ్రమ స్పందన లభించినా, ఫ్యాన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. మాస్ ఆడియెన్స్ పండగ చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ తొలి వీకెండ్‌లోనే గట్టిగా వసూళ్లని రాబట్టింది. తెలుగు స్టేట్స్ లో, ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లని సాధిస్తుంది. అక్కడ ఎన్టీఆర్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
ఇంకా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్ములేపుతుంది. హైయ్యెస్ట్ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. తొలి వీకెండ్‌లో ఈ మూవీ 304కోట్ల గ్రాస్‌ని వసూళు చేసింది(టీమ్ ప్రకటించిన లెక్కలు). సోమవారం ఎలా ఉంటుందో అనే డౌట్ ఉండేది. కానీ బెటర్‌గానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కోట్ల వరకు వసూళ్ల ని రాబట్టిందని సమాచారం. ఇది నిజమైతే మంచి హోల్డింగ్ అనే చెప్పొచ్చు.
రూ.350కోట్ బడ్జెట్‌తో దాదాపు 190కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు రెండో వారంలోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దసరా సెలవులు ఈ మూవీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. వచ్చేవారం కూడా పెద్ద సినిమాలు లేవు. దీంతో `దేవర` జోరు కొనసాగుతుంది. ఈజీగా సినిమా బ్రేక్ ఈవెన్‌కి చేరుతుంది. మూడో వారంలో లాభాల దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. దాదాపు నాలుగు వందల కోట్ల గ్రాస్ వస్తే సినిమా సేఫ్‌లోకి వెళ్తుంది. అది ఈ వారమే టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక లాంగ్ రన్‌లో బయ్యర్లకి లాభాలు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. మరి ఏ మేరకు సస్టేయిన్ అవుతుందో చూడాలి.
ఈ క్రమంలో ఇప్పుడు `దేవర` సినిమాలోని మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశం అవుతుంది. ఎన్టీఆర్‌కి జోడీగా నటించిన నటి గురించి చర్చ ప్రారంభమైంది. సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. దేవరగా, వరగా కనిపించాడు. తండ్రిగా దేవర పాత్రలో, కొడుకుగా వర పాత్రలో నటించి మెప్పించాడు ఎన్టీఆర్. ఓరకంగా ఆయన విశ్వరూపం చూపించారు. దేవరగా సినిమాలో తన పాత్ర డామినేషనే కాదు, యాక్టింగ్ పరంగానూ తన డామినేషన్ చూపించారు.
ఆయన ముందు సైఫ్ అలీ ఖాన్ కూడా తక్కువగానే కనిపించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్‌కి భార్యగా నటించిన శృతి గురించి చర్చ మొదలైంది. ఎందుకంటే జాన్వీ కపూర్ కంటే ఆమె పాత్రనే ఎక్కువగా కనిపించింది. పైగా అందంగానూ ఉంది. అందుకే ఈమె ఎవరు అనేది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు ఆడియెన్స్. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
శృతి అసలు పేరు శృతి మరాఠే. ఆమె మరాఠి నటి కావడం విశేషం. ఆమె మరాఠి ఫ్యామిలీ అయినా పుట్టింది మాత్రం గుజరాత్‌లో కావడం విశేషం. మోడల్ గా కెరీర్‌ని ప్రారంభించింది. మోడల్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది శృతి. మొదట ఆమె థియేటర్ చేసింది. పలు నాటకాలు కూడా ప్రదర్శించింది. థియేటర్ ఆర్టిస్ట్ గా రాణించి, అట్నుంచి సీరియల్స్ లోనూ మెరిసింది. అవకాశాల కోసం అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది.
2008లో `సనై చౌఘాడే` అనే మరాఠి సినిమాలో నటించింది. సినిమాల్లోకి ఆమె ఎంట్రీ ఈ మూవీతోనే అయ్యిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఆమెకి మంచి పేరొచ్చింది. దీంతో ఇతర భాషల్లోనూ ఆఫర్లు వచ్చాయి. పదిహేనేళ్ల క్రితమే ఆమె తమిళంలో సినిమాలు చేయడం విశేషం. `ఇందిరా విజా`, `నాన్ అవనిల్లై 2` చిత్రాలతో తమిళ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఓ వైపు మరాఠి, మరోవైపు తమిళ సినిమాలు చేసుకుంటూ వస్తుంది శృతి మరాఠే.
ఓ వైపు సీరియల్స్, ఇంకోవైపు సినిమాలు చేస్తూ వస్తుంది. తమిళంలో `గురు శిష్యణ్`, `అరవాన్`, హిందీలో `బుధియా సింగ్`, `వెడ్డింగ్ యానివర్సరీ`, `ముంజ్యా` సినిమాలు ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `దేవర` చిత్రంలో పెద్ద ఎన్టీఆర్‌కి భార్యగా నటించి అందరిని ఆకట్టుకుంటుంది. విలక్షణ నటిగా శృతి మంచి పేరుతెచ్చుకుంది. థియేటర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో ఆమె ఎలాంటి పాత్రలైనా ఈజీగా చేయగలదనే పేరుంది.
అందుకే గ్లామర్ పాత్రలు కాకుండా బలమైన పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలకు ప్రయారిటీ ఇస్తుంది. స్టార్ హీరోలకు కాకుండా కంటెంట్‌కే తన ఓటు వేస్తుంది. అందుకే శృతి మరాఠే సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు `దేవర` చిత్రంతో ఆమె పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ వచ్చింది. అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. జాన్వీ కపూర్ కంటే ఈమెపైనే చర్చ ఎక్కువగా జరుగుతుండటం విశేషం. అందంతో ఆకట్టుకోవడంతోపాటు, నటనతోనూ మెస్మరైజ్ చేయడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన `దేవర` చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌తోపాటు శృతి మరాఠే నటించారు. సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేశారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ సంయుక్తంగా నిర్మించిన `దేవర` పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదలైన విషయం తెలిసిందే. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో సాగే కథగా దీన్ని తెరకెక్కించారు కొరటాల.
సముద్రంలో తప్పుడు పనులు చేసే వారిని దేవర అడ్డుకోవడం, తమకు అడ్డుగా వస్తున్నాడని ఆయన్నే చంపాలని భైర టీమ్ ప్లాన్ చేయడం, అనంతరం దేవర కనిపించకుండా పోవడం, వర పాత్ర ఎంట్రీ ఇవ్వడం అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం, చివరికి వర పాత్ర ట్విస్ట్ తోనూ `దేవర` సినిమా సాగుతుంది. దేవర బతికే ఉన్నాడా?, వర పాత్ర తెరవెనుక కథేంటనేది ఈ సినిమా కథ.