ఊహకు అందని విధంగా ఎన్టీఆర్ 'దేవర' హిందీ కలెక్షన్స్

By Surya Prakash  |  First Published Oct 1, 2024, 10:32 AM IST

ఎన్టీఆర్ మెయిన్ టార్గెట్ నార్త్ ఇండియా. ఈ క్రమంలో హిందీలో దేవర వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 



రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్‌ నటించిన చిత్రం 'దేవర'. దాదాపు ఆరేళ్ల విరామం తరువాత ఆయన నటించిన సోలో చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో డివైడ్  టాక్‌ను తెచ్చుకున్నా దేవర కలెక్షన్స్  విషయంలో మాత్రం స్ట్రాంగ్‌గానే వుంది. తొలి రోజు  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి ప్రారంభ వసూళ్లను సాధించడమే కాకుండా డే వన్‌ వసూళ్లల్లో రికార్డులను కూడా నెలకొల్పింది.  అయితే దేవర ప్యాన్ ఇండియా సినిమా గా రిలీజైంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ మెయిన్ టార్గెట్ నార్త్ ఇండియా. ఈ క్రమంలో హిందీలో దేవర వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 

దేవర వరల్డ్ వైడ్ వీకెండ్ వసూళ్లు

మొదటి రోజు దేవర వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లు రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఇక రెండవ రోజు కూడా దేవర బుకింగ్స్ అదరగోట్టాయి అనే చెప్పాలి. మరి ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో  ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూ  దేవర బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ఈ క్రమంలో దేవర మొదటి వీకెండ్ పూర్తి చేసుకుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్లు గ్రాస్, 2వ రోజు రూ. 71 కోట్లు కలిపి మొత్తంగా రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 243 కోట్లు రాబట్టింది. నిన్న మూడవ రోజు వీకెండ్ కావడంతో  రూ. 61 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది దేవర. అటు ఓవర్సీస్ లో మూడు రోజుకు సూపర్ పెర్ఫామ్ చేసింది దేవర. మొత్తంగా మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 304 కోట్లు కొల్లగొట్టి తారక్ సోలో గా కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు అందుకున్నాడు. సోమవారం కలెక్షన్స్ లో కొంత డ్రాప్ కనిపించింది.

Latest Videos

నార్త్ లో దేవర ఊహించిన ఊపు లేదు కానీ...

ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత నార్త్‌ ఇండియాలో మంచి మార్కెట్‌ను సంపాందించుకున్నారు.  ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ నార్త్‌లో దాదాపుగా రూ.300 కోట్లు వసూలు చేసింది. కానీ ఎన్టీఆర్‌ దేవరకు హిందీలో ఎక్స్‌పెక్ట్‌ చేసిన కలెక్షన్స్‌ రాలేదు. అలాగని మరీ తక్కువా లేదు తొలిరోజు కేవలం రూ.7 కోట్లు దాటి  మాత్రమే వసూలు చేసింది. అక్కడ నుంచి మెల్లిగా పికప్ అవ్వటం మొదలైందని అక్కడ ట్రేడ్‌  అంటోంది. 


ఉత్తరాదిలో నటుడి, నిర్మాత, పంపిణీదారుడిగా పేరు గన్న  కరణ్ జోహార్ చేతికి  దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు లభించాయి.   నార్త్ కు చెందిన  ధర్మమూవీస్, AA ఫిల్మ్స్ఇండియా సంస్థల కలిసి ఈ సినిమా రిలీజ్ చేసాయి.  కరణ్ జోహార్  గతంలో బాహుబలి సినిమాను కూడా ఆయన తన భుజాలపై వేసుకుని సక్సెస్ చేసారు. ఈ క్రమంలో దేవరకు నార్త్ లోనూ మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. మంచి థియేటర్స్ లభించాయి. 

బిగ్ బాస్ హౌజ్‌లో మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

దేవర హిందీ వెర్షన్ పికప్ అవుతోంది

నార్త్ బెల్ట్ లో  మొదటి కేవలం రు 7.95 కోట్లు, రెండవ రోజు రూ. 9.50 కోట్లు, ఆదివారం అనగా మూడవ రోజు రూ. 12.07 కోట్లు రాబట్టిందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ పేర్కొన్నారు. మొదటి మూడు రోజులకు మొత్తంగా చూసుకుంటే రూ. 29.52 కోట్లు కలెక్ట్ చేసాడు దేవర. ఈ కలెక్షన్స్ ను ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజు కంటే రెండవ రోజు, రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ రాబట్టగలిగాయి. కాగా రోజు రోజుకు దేవర కలెక్షన్స్ పెరుగుతుండడంతో నార్త్ లో ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా . మొదటి మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రూ. 44 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ హిందీ వర్షన్ లో భారీ నంబర్స్ కనిపించాయి.

దసరా రోజుల్లో దేవర దండయాత్ర 

అక్టోబరు 2న గాంధి జయంతి పబ్లిక్ హాలీడే కావడంతో అడ్వాంటేజ్ ఉండొచ్చు. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబరు 3నుండి దసరా సెలవులు కావడం కూడా కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంది. దసరా చివరి రోజు దాకా దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది అని ట్రేడ్ అంచనా  వేస్తోంది.  ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.  తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది. లాంగ్ రన్ లో దేవర ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.

click me!