‘శాంకుతలం’ చిత్రం నుంచి విడుదలవుతున్న పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా థర్డ్ సింగిల్ కూడా విడుదలై దూసుకుపోతోంది.
పురాణాల ఆధారంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘శాకుంతలం’. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)- దేవ్ మోహన్ జంటగా నటిస్తున్నారు. శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ కథ నేపథ్యంలో చిత్రం రూపుదిద్దుకుంటుండగా.. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ (Gunashekar) దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెలలో విడుదలకు షెడ్యూల్ చేయడంతో చిత్ర ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా Shaakuntalam నుంచి ఆకట్టుకునే సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికే చిత్రం నుంచి ‘మల్లిక మల్లిక’, ‘రుషివనంలోన’ సాంగ్స్ విడుదలై ఆకట్టుకున్న విషయంతెలిసిందే. ఇక తాజాగా మరో బ్యూటీఫుల్ సాంగ్ ను అందించారు. ‘ఏలేలో ఏలేలో’ మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన ట్యూన్ వినసొంపుగా ఉంది. ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి గాత్రం శ్రావ్యంగా ఉంది. ఈతరహా సంగీతం చాలా కాలం తర్వాత వింటున్నామని సంగీత ప్రియులు అభిప్రాయపుడుతున్నారు. లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి.
పాన్ ఇండియా చిత్రంగా ‘శాకుంతలం’ విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్స్ బ్యానర్ పై నిర్మాత నీలిమ గుణ నిర్మిస్తున్నారు. విజువల్ వండర్ గా త్రీడీ వెర్షన్ లోనూ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 17న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
మరోవైపు సమంత విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ‘సిటాడెల్’సిరీస్ ఆధారంగా ఇండియన్ వెర్షన్ లో నిర్మిస్తున్న స్పై థ్రిల్లర్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు. నిన్న విడుదైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
Cherishing the journey of love 🤍🦢 (Telugu)
▶️ https://t.co/eK38SRA90X pic.twitter.com/3zkPdgf8Np