ఒకరోజు ముందే బాలయ్య-పవన్ ఎపిసోడ్... రికార్డులు బద్దలు కొట్టేందుకు ఫ్యాన్స్ సిద్ధం!

Published : Feb 02, 2023, 09:50 AM ISTUpdated : Feb 02, 2023, 10:07 AM IST
ఒకరోజు ముందే బాలయ్య-పవన్ ఎపిసోడ్... రికార్డులు బద్దలు కొట్టేందుకు ఫ్యాన్స్ సిద్ధం!

సారాంశం

బాలయ్య-పవన్ ల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రసారానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఫ్యాన్స్ కొత్త సినిమా రిలీజ్ కోసం ఎదురు చూసినట్లు చూస్తున్నారు. అలాగే భారీ రికార్డ్స్ సెట్ చేయాలనుకుంటున్నారు. 


పవన్ కళ్యాణ్ అతిపెద్ద టాలీవుడ్ స్టార్. మరోవైపు పొలిటీషియన్. అలాంటి ఓ పర్సనాలిటీ బోల్డ్ టాక్ షోకి వస్తున్నారంటే సాధారణంగానే ఆసక్తి ఏర్పడుతుంది. దానికి తోడు ప్రోమోలు అంచనాలు ఆకాశానికి చేర్చాయి. పవన్ జీవితంలో అతిపెద్ద కాంట్రవర్సీ, ప్రత్యర్థులకు ఆయుధంగా మారిన మూడు పెళ్లిళ్ల వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. వెరసి బాలయ్య-పవన్ ఎపిసోడ్ పై ఎక్కడలేని హైప్ ఏర్పడింది. ఫిబ్రవరి 3న ఎపిసోడ్ పార్ట్ 1 స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ ఒకరోజు ముందే ఎపిసోడ్ ప్రసారం కానుంది. 

ఈ ఎపిసోడ్ కోసం ఆహా యాజమాన్యం అన్నివిధాలా సిద్ధమైంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటుంది. ప్రభాస్ ఎపిసోడ్ విషయంలో ఆహా పూర్తిగా విఫలం చెందారు. ఒక్కసారిగా లక్షల్లో లాగిన్ కావడంతో యాప్ క్రాష్ అయ్యింది. సర్వర్స్ పనిచేయకపోవడంతో యాప్ సేవలు ఆగిపోయాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ని ఈ పరిణామం తీవ్ర నిరాశకు గురిచేసింది. 

ఈ సమస్య పవన్ ఎపిసోడ్ విషయంలో తలెత్తకుండదని ప్రత్యేక ఏర్పాట్లు చేశారట. ట్రాఫిక్ ని తట్టుకునేలా యాప్ ని సిద్ధం చేశారట. పవన్ పేరిట అన్ స్టాపబుల్ తో అన్ బీటబుల్ రికార్డు సెట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్ ని వీక్షించే అవకాశం కలదని అందరూ భావిస్తున్నారు. మొత్తంగా నేడు సాయంత్రం ఆహా వేదికగా బాలయ్య-పవన్ అభిమానుల జాతర జరగనుంది. 

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఆయన ఆత్మహత్య  చేసుకోవాలనుకోవడానికి కారణాలు ఏమిటీ? అనే అంశాలతో పాటు రాజకీయ ఆరోపణలకు ఈ వేదికగా సమాధానం దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. నేడు రాత్రి 9 గంటలు పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరోవైపు పవన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. హరి హర వీరమల్లు షూట్ పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్, సుజీత్ మూవీ షూట్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తో మూవీ ప్రకటించి ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..