'యాత్ర' దర్శకుడికి జగన్ పార్టీ టికెట్.. అసలు నిజమేమిటంటే..?

By Udaya DFirst Published Feb 15, 2019, 10:21 AM IST
Highlights

దివంగత వైఎస్సార్ జీవితచరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

దివంగత వైఎస్సార్ జీవితచరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా తీసిన దర్శకుడికి వైఎస్ జగన్ పార్టీ టికెట్ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపించాయి.

దీనిపై స్పందించిన దర్శకుడు రాజకీయ నేపధ్యంలో సినిమా తీసినంతమాత్రాన రాజకీయాలు అంతకట్టడం కరెక్ట్ కాదని అన్నారు. జగన్ తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తనకు అసలు భారతదేశ పౌరసత్వమే లేదని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

''నాకు ఓటు హక్కు లేదు. ఈ దేశంతో సంబంధమే లేదు. నాకు న్యూజిలాండ్ పౌరసత్వం ఉంది. నాకు రాజకీయాలు అవసరం లేదు. జగన్ సీటు ఇస్తానన్నారని ఏవేవో ప్రచారం చేస్తున్నారు. అదంతా అబద్ధం. నేను ఇక్క కథ చెప్పడానికి వచ్చాను. చెప్పాను.. సినిమా తీయడం వారనే కా పని. రాజకీయాలలోకి రావాలి. ప్రజాసేవ చేయాలనే ఆలోచన లేదు'' అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి సినిమాలేవీ తీయడం లేదని, కాస్త సమయం తీసుకొని నెక్స్ట్ సినిమా తీస్తానని, ఒక సినిమా తీయడానికి తనకు సుమారు రెండేళ్ల సమయం పడుతుందని చెప్పారు. హడావిడిగా సినిమా తీయలేనని అన్నారు. 

click me!