`యాత్ర 2` కలెక్షన్లు.. మరీ అంతనా?.. నిజంగా షాకే

Published : Feb 10, 2024, 06:51 AM ISTUpdated : Feb 10, 2024, 06:53 AM IST
`యాత్ర 2` కలెక్షన్లు.. మరీ అంతనా?.. నిజంగా షాకే

సారాంశం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఓదార్పు యాత్ర ప్రధానంగా రూపొందిన `యాత్ర 2` ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ మూవీ కలెక్షన్లు మాత్రం షాకిస్తున్నాయి. 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టి ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన చిత్రం `యాత్ర2`. గతంలో వచ్చిన `యాత్ర`కి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు మహి వీ రాఘవ్‌. మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్‌ వచ్చింది. గురువారం విడుదలైన ఈ మూవీకి తొలి రోజు కలెక్షన్లు షాకిస్తున్నాయి. 

`యాత్ర`లో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఉన్నారు. మరోవైపు తమిళ హీరో జీవా ఉన్నారు. వైఎస్‌ పాత్రలో మమ్ముట్టి చేయగా, వైఎస్‌ జగన్‌గా జీవా నటించాడు. సినిమాని తండ్రి కొడుకుల మధ్య బాండింగ్‌, తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం కొడుకు చేసిన పోరాటం, ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు.

సినిమాగా ఇది ఫర్వాలేదు. కానీ దారుణమైన ఓపెనింగ్స్ రాబట్టడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ మూవీ తొలి రోజు కేవలం మూడు కోట్ల గ్రాస్‌ మాత్రం చేసింది. కోటిన్నర షేర్‌ దక్కింది. `యాత్ర`కి మొదటి ఐదున్నర కోట్ల గ్రాస్‌, మూడు కోట్ల షేర్‌ వచ్చింది. ఇప్పుడు అందులో సగం మాత్రమే వచ్చింది. పైగా ఇప్పుడే వైఎస్‌ అభిమానులు యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీలో ఏకంగా ప్రభుత్వంలో ఉన్నారు. వైసీపీ అభిమానులు చూసి ఈ మూవీ సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. కానీ ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యపరుస్తుంది. 

ఇక రెండో రోజు ఈ మూవీ మరింత డ్రాప్‌ అయ్యింది. ఎక్కడ కూడా హౌజ్‌ ఫుల్‌ బోర్డ్ లు లేవు. బుక్‌మై షోలో చాలా థియేటర్లలో గ్రీన్‌ నెంబర్స్ కనిపిస్తున్నాయి. కనీసం సగం కూడా అవి ఫిల్‌ కాలేదు. ఇది మూవీ డ్రాప్‌ అవుతుందనే సంకేతాలనిస్తుంది. మరి మున్ముందు అయినా పుంజుకుంటుందో చూడాలి. అయితే ఈ మూవీని వైసీపీ ఎమ్మెల్యేలు టికెట్లు కొని ఫ్రీగా చూపించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?
ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్