బాలయ్యని ఫస్ట్ టైమ్‌ డైరెక్ట్ చేయబోతున్న స్టార్‌ డైరెక్టర్‌..?

Published : Feb 09, 2024, 11:59 PM IST
బాలయ్యని ఫస్ట్ టైమ్‌ డైరెక్ట్ చేయబోతున్న స్టార్‌ డైరెక్టర్‌..?

సారాంశం

నందమూరి  నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుని ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఓ భారీ సినిమా చేస్తున్నారు. దీంతోపాటు తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట. 

బాలకృష్ణ హ్యాట్రిక్‌ హిట్లతో జోరు మీదున్నాడు. ఆయన `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలు చేశాడు. వరుసగా విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఎన్బీకే109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు బాబీ. ఓ పీరియడ్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీటికి సంబంధించిన విడుదలైన ప్రీ లుక్‌ క్యూరియాసిటీని పెంచాయి. ఈ మూవీని దసరాకి తీసుకురావాలని, లేదంటే వచ్చే సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్నారట. 

ఇదిలా ఉంటే బాలయ్య నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది తాజాగా క్లారిటీ వచ్చింది. బోయపాటి శ్రీనుతో సినిమా ఉంటుందని భావించారు. కానీ అది లేదని తెలుస్తుంది. `అఖండ 2` పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య నెక్ట్స్ మూవీ ఇది, అది అంటూ పలు పుకార్లు వినిపించాయి. కానీ తాజాగా ఓ స్టార్‌ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. బాలయ్యతో సినిమాలు చేయని దర్శకుడు లైన్‌లోకి వచ్చాడు. ఆయనే హరీష్‌ శంకర్‌. ఈ కాంబో సెట్‌ కాబోతుందట. 

బాలకృష్ణ హీరోగా హరీష్‌ శంకర్‌ ఓసినిమా చేయబోతున్నారట. తాజాగా ఈ ప్రాజెక్ట్ సెట్‌ అయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్నాయట. ఈ ఇద్దరు మొదటి సారి కలిసి పనిచేయబోతున్నారు. దీన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్‌ నిర్మించబోతుందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం హరీష్‌ శంకర్‌.. రవితేజ హీరోగా `మిస్టర్‌ బచ్చన్‌` మూవీ చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీని శరవేగంగా పూర్తి చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు. దీంతోపాటు పవన్‌ కల్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. `మిస్టర్‌ బచ్చన్‌` తర్వాత పవన్‌ సినిమాని కంప్లీట్‌ చేయబోతున్నారు. ఆ తర్వాత బాలయ్య మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajinikanth : 75 ఏళ్ల వయసులో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద