`రామాయణ్‌`లో యష్ పారితోషికం.. ప్రభాస్‌కి పోటీ తప్పేలా లేదుగా?

Published : Mar 05, 2024, 06:38 PM ISTUpdated : Mar 05, 2024, 07:33 PM IST
`రామాయణ్‌`లో యష్ పారితోషికం.. ప్రభాస్‌కి పోటీ తప్పేలా లేదుగా?

సారాంశం

`కేజీఎఫ్‌`తో సంచలనాలు సృష్టించాడు కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌. ప్రస్తుతం `టాక్సిక్‌`లో నటిస్తున్న ఆయన నెక్ట్స్ రావణుడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీ పారితోషికం షాకిస్తుంది.   

ఇటీవల కాలంలో మైథలాజికల్‌ ఎలిమెంట్లతో కూడిన సినిమాల జోరు సాగుతుంది. `హనుమాన్‌` సినిమా సంక్రాంతికి వచ్చి ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. అంతకు మందుకు ప్రభాస్‌ నటించిన `ఆదిపురుష్‌` పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బాగానే వసూళ్లు చేసింది. ఇప్పుడు చిరంజీవి మైథలాజికల్ ఎలిమెంట్లతోనే `విశ్వంభర` సినిమా చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి` కూడా అదే కాన్సెప్ట్ తో వస్తుంది. మంచు విష్ణు కూడా `కన్నప్ప`తో అదే ప్రయోగం చేస్తున్నాడు. 

ఈ క్రమంలో మరో మైథలాజిక్‌ మూవీ రూపొందబోతుంది. రామాయణం ఆధారంగా `రామాయణ్‌` సినిమా తెరకెక్కబోతుంది. బాలీవుడ్‌ దర్శకుడు నితీష్‌ తివారీ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మేరకు కాస్టింగ్‌ ఎంపిక కూడా జరుగుతుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ పూర్‌ని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సీతగా సాయిపల్లవి పేరు, రావణుడిగా `కేజీఎఫ్‌` యష్‌ నేమ్‌ వినిపిస్తుంది. అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్‌, శూర్పణఖగా రకుల్‌ పాత్రలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ప్రభాస్‌ కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. గెస్ట్ గా ఆయన మెరిసే అవకాశం ఉందట. 

ఇదిలా ఉంటే ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు నితీష్‌ తివారీ. స్టార్‌ కాస్టింగ్‌ పారితోషికాలే వందల కోట్లు అయ్యేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యష్‌ పారితోషికం షాకిస్తుంది. సినిమాలో ఆయనకే అత్యధిక రెమ్యూనరేషన్‌ ఇవ్వబోతున్నారట. ఏకంగా 150కోట్ల వరకు యష్‌కి పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన పాత్ర మెయిన్‌గా సినిమా సాగుతుందని తెలుస్తుంది. పైగా `కేజీఎఫ్‌` తర్వాత యష్‌ రేంజ్‌ పెరిగిపోయింది. బాలీవుడ్‌లో మార్కెట్‌ ఏర్పడింది. పాన్‌ ఇండియా హీరో అయ్యాడు. దీంతో ఆయనకు భారీగా పారితోషికం ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

Read more: కోట్లిచ్చి సెలబ్రిటీలను పెళ్లిళ్లకు రమ్మంటున్నారు.. దుమారం రేపుతున్న నాగార్జున వ్యాఖ్యలు..

అయితే ప్రభాస్‌ ఇప్పుడు ఒక్కో సినిమాకి 120-150కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. సినిమా రేంజ్‌ని బట్టి ఆయన పారితోషికం ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న  `కల్కి2898ఏడీ`కి 150కోట్లకుపైగానే ఇస్తున్నారట. దీంతో యష్‌ ఇప్పుడు ప్రభాస్‌తో పోటీ పడుతుండటం విశేషం. ఈ మూవీలో ఇతర ఆర్టిస్ట్‌ల పారితోషికాలు యాభై కోట్లలోపే ఉంటున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన నిజనిజాలు తెలియాల్సి ఉంది. `కేజీఎఫ్‌ 2` విడుదలైన దాదాపు ఏడాదిన్నర తర్వాత కొత్త సినిమాని ప్రకటించారు యష్‌. ప్రస్తుతం ఆయన `టాక్సిక్‌` అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

Also Read: మీనాక్షి చౌదరి సినిమాల లైనప్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.. మరో శ్రీలీల అవుతుందా?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌