#Kalki2898AD:ప్రభాస్‌ 'కల్కి' లో దీపికా పాత్ర పేరు, ఇంకో ఇంట్రస్టింగ్ మేటర్

Published : Mar 05, 2024, 08:16 AM IST
 #Kalki2898AD:ప్రభాస్‌ 'కల్కి' లో దీపికా పాత్ర పేరు, ఇంకో ఇంట్రస్టింగ్ మేటర్

సారాంశం

దీపికా పదుకోన్‌ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’.  

ప్రభాస్,యంగ్ డైరక్టర్  నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సెమీ మైథలాజికల్ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పనులు ఊపందుకున్నాయి.  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామలు దీపిక పదుకొణే, దిశా పటానీ నటిస్తున్నారు.  అలాగే  దీపికా పదుకోన్‌ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’.

 ఈ సినిమాలో పద్మ అనే పాత్రలో దీపికా పదుకోన్‌ నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ‘కల్కి 2898 ఏడీ’కి సంబంధించి ఇప్పటికే దీపిక పాత్ర షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం. అలాగే  ఈ సినిమాలోని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలని దీపిక అనుకుంటున్నారని మీడియా వర్గాల సమచారం. తన పాత్రకు తనే వాయిస్ ఇవ్వటం ద్వారా ఆ క్యారక్టర్ కు ఎగస్ట్రా బలం వచ్చినట్లు అవుతుందని ఆమె భావిస్తున్నారట. అతి త్వరలోనే దీపిక వాయిస్‌కు  డబ్బింగ్‌ టెస్ట్‌ నిర్వహించి, ఫైనల్ కాల్ తీసుకోనున్నారట నాగ్‌ అశ్విన్ . అదే జరిగితే దీపికా వాయిస్ ని మనం డైరక్ట్ గా తెలుగులో వింటాము. అయితే ఆమెకు తెలుగు ఎంతవరకూ వచ్చు అనేది ఇక్కడున్న అతి పెద్ద సమస్య . అయితే నాగ్ అశ్విన్ అవన్నీ పరిశీలించే డెసిషన్ తీసుకోబోతున్నారు. 

హాలీవుడ్ స్థాయి విలువలతో తెరకెక్కుతున్న 'కల్కి...' చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  '6 వేల ఏళ్ల నాటి కథ.... 2024 మే 9న ప్రారంభం కాబోతోంది' అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూపించని విజువల్స్ ను అత్యున్నత సాంకేతిక విలువలతో ఆవిష్కరించడానికి నాగ్ అశ్విన్ అండ్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ చిత్రానికి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోందని తెలిసింది. ప్రభాస్, దిశాపటానీలపై ఓ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?