విషాదం.. యష్ చోప్రా సతీమణి కన్నుమూత.. షారుఖ్ ఖాన్ నివాళి

By Asianet News  |  First Published Apr 20, 2023, 4:33 PM IST

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత యష్ చోప్రా భార్య కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు, స్టార్స్ ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్నారు. 
 


చిత్ర పరిశ్రమలో గతేడాది వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క ఏడాదిలోనే టాలీవు్ లోని దిగ్గజ్జాలు కన్నుమూయడం ఇండస్ట్రీకి తీరని లోటుగా మారింది. రీసెంట్ గా ప్రముఖ కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ లో విషాదం నెలకొంది. 

బాలీవుడ్ కు చెందిన ప్రముఖ, దివంగత యస్ చోప్రా (Yash Chopra) భార్య పమేలా చోప్రా (Pamela Chopra) కన్నుమూశారు. నిర్మాతగా, సింగర్ గా పమేలా గుర్తింపు దక్కించుకున్నారు. ఈరోజు ఉదయం తన 74వ ఏటా పమేలా తుదిశ్వాస విడిచారు. అందిన సమాచారం మేరకు గత కొద్దిరోజులుగా పమేలా చోప్రా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 
దీంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ఆమెకు పది రోజులకు పైగానే చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూసింది. దీంతో ఇవాళే  ఉదయం 11 గంటలకు ఆమె అంత్యక్రియలను కూడా నిర్వహించారు. ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ Shah Rukh Khan పమేలా చోప్రా పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అజయ్ దేవగన్, తదితరులు తమ సానుభూతిని వ్యక్తం చేశారు.  

Latest Videos

యష్ చోప్రా 2012లోనే మరణించారు. ఇక వీరికి ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా ఇద్దరు కొడుకులు. రీసెంట్ గా వచ్చిన ‘పఠాన్’ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన విషయం తెలిసిందే. బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. మున్ముందు మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. టైగర్3, వార్2 ఈ బ్యానర్ లోనే రాబోతున్నాయి. 

click me!