
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడంతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్నప్పటికీ సెలెబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఏడాది రాంచరణ్ కి ఎన్నో మెమొరీస్ అందిస్తోంది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం, అందులో చరణ్ కూడా భాగం కావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా ఉంది.
అలాగే రాంచరణ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఉపాసన ప్రస్తుతం 6 నెలల గర్భవతి అనే సంగతి తెలిసిందే. ఈనెల 27న రాంచరణ్ 38వ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. అసలే జోష్ లో ఉన్న మెగా ఫ్యాన్స్ చరణ్ బర్త్ డేని ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.
కనీవినీ ఎరుగని విధంగా ప్లానింగ్ జరుగుతోంది. తాజాగా మెగా అభిమానులు ఒక క్రేజీ అనౌన్సమెంట్ చేశారు. మార్చి 26న రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా ఒక ఇంపీరియల్ కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రాంచరణ్ అంతర్జాతీయంగా క్రేజ్ తెచ్చుకుని గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందుతున్నాడు. దీనితో రాంచరణ్ బర్త్ డే వేడుకలు అదే స్థాయిలో ఉండేలా ప్లానింగ్ జరుగుతోంది.
ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఫ్యాన్స్ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయే విధంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రాంచరణ్ బర్త్ డే రోజున మెగా ఫ్యాన్స్ ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఇస్తారో చూడాలి. అలాగే ఈ నెల 17, 18 న ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించబోయే కాన్ క్లేవ్ లో రాంచరణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లతో కలసి వేదిక పంచుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.