బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొడితే ఎవరి దగ్గరికి వెళ్లాలో కూడా తెలియలేదు... వక్కంతం వంశీ సంచలన వ్యాఖ్యలు

Published : Dec 10, 2023, 01:19 PM IST
బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొడితే ఎవరి దగ్గరికి వెళ్లాలో కూడా తెలియలేదు... వక్కంతం వంశీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పై అనేక వివాదాలు ఉన్నాయి. వాటిల్లో వక్కంతం వంశీతో గొడవ ఒకటి. తాజా ఇంటర్వ్యూలో వక్కంతం వంశీ ఈ వివాదంపై స్పందించారు.

2015లో విడుదలైన టెంపర్ సూపర్ హిట్. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాతగా బండ్ల గణేష్ ఉన్నారు. పూరి జగన్నాధ్ తన చిత్రాలకు సొంతగా కథలు రాసుకుంటారు. వరుస పరాజయాల నేపథ్యంలో వక్కంతం వంశీ కథతో టెంపర్ మూవీ చేశాడు. అయితే బండ్ల గణేష్ వక్కంతం వంశీకి డబ్బులు ఇవ్వలేదట. 

వక్కంతం వంశీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న వక్కంతం వంశీ బండ్ల గణేష్ తో నాటి వివాదం గురించి ఓపెన్ అయ్యారు. టెంపర్ మూవీకి కథ అందించినందుకు బండ్ల గణేష్ నాకు ఒక డేట్ వేసి చెక్ ఇచ్చాడు. ఆ చెక్ బౌన్స్ అయ్యింది. అప్పటికే సినిమా విడుదలైంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరిని కలవాలో తెలియలేదు. 

అతను నాకు డబ్బులు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడని అర్థం అయ్యింది. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో నాకు తెలియదు. బండ్ల గణేష్ ని కలిసే ప్ ప్రయత్నం చేసిన కుదర్లేదు. అప్పుడు నేను కోర్టును ఆశ్రయించాను. కోర్టు చుట్టూ చాలా కాలం తిరిగాను. పరిశ్రమకు చెందిన ఓ పెద్దమనిషి చెప్పడంతో డబ్బులు ఇచ్చాడు. తర్వాత నుండి నాతో బాగానే ఉన్నాడు. నాకు అతడి మీద ఎలాంటి కోపం లేదు. బండ్ల గణేష్ మాదిరి చాలా మంది పరిశ్రమలో నన్ను డబ్బులు విషయంలో మోసం చేశారు. అని వక్కంతం వంశీ చెప్పుకొచ్చాడు.

PREV
click me!

Recommended Stories

Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్