#SaripodhaSanivaaram రిలీజ్ టైమ్ చెప్పిన నాని

Published : Dec 10, 2023, 11:11 AM IST
 #SaripodhaSanivaaram రిలీజ్ టైమ్ చెప్పిన నాని

సారాంశం

‘సరిపోదా శనివారం’సినిమాలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

నేచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా ‘అంటే సుందరానికీ’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అయితే.. రెండో సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) యూనిక్ యాక్షన్ మూవీ కాబోతోంది. పూర్తి మాస్, యాక్షన్ అవతార్‌లో నానీని వివేక్ ఆత్రేయ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం విడుదలైన అన్‌చెయిన్డ్ వీడియో మాస్‌ను ఉత్సాహపరిచింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతోందనేది నాని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం. 

ఈ విషయమై నాని క్లారిటీ ఇచ్చారు. తన తాజా చిత్రం హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా అమెరికా వెళ్లిన ఆయన అక్కడ వారితో మాట్లాడుతూ... ఆగస్ట్ 2024కు ఈ చిత్రం రిలీజ్ కు రెడీ చేస్తామని  చెప్పుకొచ్చారు. కథ, పాత్ర డిమాండ్ మేరకు మేకోవర్ కూడా అవుతున్నారు. ‘సరిపోదా శనివారం’లో రగ్డ్ లుక్‌లో నాని కనిపించనున్నారు. 

‘సరిపోదా శనివారం’సినిమాలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘దసరా’ లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న మాస్, రగ్డ్ మూవీ తర్వాత.. ‘హాయ్ నాన్న’ అనే క్లాస్, ఫీల్ గుడ్ స్టోరీని నాని ఎంచుకున్నారు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ లాంటి డిఫరెంట్ యాక్షన్ జోనర్ కథను ఎంపిక చేసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?