ప్రేమకి, స్వేచ్ఛకి, విప్లవానికి ప్రతిరూపాలు వీళ్లు.. `విరాటపర్వం` ఉమెన్స్ డే గిఫ్ట్

Published : Mar 08, 2021, 11:46 AM IST
ప్రేమకి, స్వేచ్ఛకి, విప్లవానికి ప్రతిరూపాలు వీళ్లు.. `విరాటపర్వం` ఉమెన్స్ డే గిఫ్ట్

సారాంశం

వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రియమణి, నందితా దాస్‌, ఈశ్వరీరావు, జరినా వాహబ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నటీమణుల  పాత్రలు ఎంతో కీలకమైనవి. తాజాగా అంతర్జాతీయ ఉమెన్స్ డే ని పురస్కరించుకుని మహిళలకు గిఫ్ట్ ఇచ్చింది చిత్ర బృందం.

`చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ తనది.. ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమే అని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది. మహా సంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది. అడవి బాట పట్టిన అనేక మంది వీరుల తల్లులకు వీళ్లు ప్రతిరూపాలు. వీళ్ల మార్గం అనన్యం. అసామాన్యం. రెడ్‌ సెల్యూల్‌ టూ ఆల్‌ గ్లోరియస్‌ ఉమెన్స్` అంటున్నాడు రానా. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. 

వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రియమణి, నందితా దాస్‌, ఈశ్వరీరావు, జరినా వాహబ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నటీమణుల  పాత్రలు ఎంతో కీలకమైనవి. తాజాగా అంతర్జాతీయ ఉమెన్స్ డే ని పురస్కరించుకుని మహిళలకు గిఫ్ట్ ఇచ్చింది చిత్ర బృందం. అందులో భాగంగా రానా వాయిస్‌ ఓవర్‌తో మహిళ గొప్ప ప్రేమ, స్వేచ్ఛని, పోరాటాన్ని, త్యాగాన్ని వివరించిన విధానం గూస్‌బమ్స్ తెస్తుంది. వీడియో వైరల్‌ అవుతుంది.

అమరుడు కామ్రేడ్‌ రవన్న జీవితం ఆధారంగా నక్సల్‌ పోరాటం ప్రధానంగా దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటిస్తుంది. ఆమె రానాకి లవ్‌ ఇంట్రెస్ట్ గా, నక్సల్‌ సానుభూతి పరురాలుగా కనిపించనున్నారు.  ప్రియమణి నక్సలైట్‌ పాత్రలో నటిస్తుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?