హీరో విజయ్ బెదిరిస్తున్నాడు అరెస్ట్ చేయండి

Published : Jul 07, 2023, 04:17 PM ISTUpdated : Jul 07, 2023, 04:24 PM IST
హీరో విజయ్ బెదిరిస్తున్నాడు అరెస్ట్ చేయండి

సారాంశం

కోలీవుడ్ స్టార్ విజయ్ పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియా వేధింపులకు విజయ్ ఫ్యాన్స్ పాల్పడ్డారని, ఆయన కూడా బెదిరించారని ఆరోపణలు చేస్తున్నారు.   

విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన చిత్రం లియో. ఈ చిత్రం నుండి 'నా రెడీ' అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లిరిక్స్ వివాదాస్పదం అయ్యాయి. ముత్తు పదార్థాల వాడకం, స్మోకింగ్, రౌడీయిజం వంటి చెడును ప్రోత్సహించేదిగా ఉందని పలువురు వాపోయారు. ఈ సాంగ్ కి వ్యతిరేకంగా ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియా పోరాటం చేశారు. మీడియా ఎదుట సాంగ్ మీద ధ్వజమెత్తారు. 

ఈ క్రమంలో హీరో విజయ్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారట. సోషల్ మీడియాలో ఆమెను వేధిస్తున్నారట. విజయ్ ఐడీని ట్యాగ్ చేస్తూ తన మీద అసభ్యకర కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారని ఆమె వాపోయారు. చెన్నై డీజీపీ ఆఫీసులో ఆమె పిర్యాదు చేశారు. విజయ్ తన ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారని, ఆయన కూడా బెదిరించాడంటూ ఆరోపణలు చేశారు. బెదిరింపులకు పాల్పడిన విజయ్ ని అరెస్ట్ చేయాలని పీటీషన్ లో పొందుపరిచారు. నేను పోరాటం చేయడం వలెనే 'నా రెడీ' సాంగ్ లో ధూమపానం హానికరం అనే లిరిక్స్ పొందుపరిచారని ఆమె అన్నారు. 

చాలా మంది హీరోలు తమ సినిమాల్లో స్మోకింగ్ చేస్తున్నారు కదా అని ప్రశ్నించగా.. గతంలో కూడా రజినీకాంత్ స్మోకింగ్ సీన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఆమె వెల్లడించారు. విజయ్ రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్న క్రమంలో ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారట. అందుకే ఆయన మూడేళ్లు సినిమాల నుండి విరామం తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతుంది. 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్