పంజా వైష్ణవ్ తేజ్ - శ్రీలీలా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా తాజాగా మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్ ‘ఉప్పెన’తో ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే మంచి హిట్ సొంతం చేసుకున్నారు. మెగా హీరోగా మంచి గుర్తింపు సాధించారు. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదు. దీంతో మంచి హిట్ కోసం వైష్ణవ్ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం తన నాలుగో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం Aadikeshava. వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) మరియు క్రేజీ హీరోయిన్ శ్రీలీలా జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. వైష్ణవ్ తన కెరీర్‌లోనే తొలిసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తుండటం విశేషం. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ చిత్రంతో మంచి టాక్ సాధిస్తాడని నమ్ముతున్నారు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది.
ఇప్పటికే చాలా చిత్రాలు రిలీజ్ డేట్స్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఆగస్టు 18న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఇక చిత్రంతో వైష్ణవ్ తేజ్ ఎలా అలరిస్తాడో చూడాలి. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ ఆసక్తికరంగానే ఉంది. ఇక వైష్ణవ్ ఓ గ్రామంలోని శివాలయాన్ని ఆక్రమించాలని చూస్తున్నవారిని అడ్డుకునే పాత్రలో నటిస్తున్నారు.
ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఆదికేశవ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లింప్స్ కి ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది.
The journey of is all set to rock theatres on 18th August. ❤️🔥See you at the Theaters 💥 pic.twitter.com/7WA98ze2mS
— Panja VaishnavTej (@VaishnavTejOffl)