సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీ ట్రైలర్ అదుర్స్

Published : Feb 12, 2017, 06:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీ ట్రైలర్ అదుర్స్

సారాంశం

సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీ ట్రైలర్ కు విశేష స్పందన పవర్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన సాయిధరమ్ తేజ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విన్నర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ లో మెరిసింది. రెండు రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ట్రైలర్ కు ఇండియన్ యానిమల్ బోర్డు నుండి అనుమతి రాకపోవడంతో కాస్త ఆలస్యంగా ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

 

ఇక ఈ ట్రైలర్ చూస్తే మాస్ కు అలాగే మెగా ఫ్యాన్స్  కేక పెట్టడం ఖాయం . మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది విన్నర్ ట్రైలర్. ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్ దగ్గర క్లిక్స్ ఉన్నాయంటే ఏ రేంజ్ లో అదరగొడుతోందో అర్థం చేసుకోవచ్చు. 

 

జగపతి బాబు , ముఖేష్ ఋషి , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ అందాలు కూడా అదనపు ఆకర్షణ గా నిలవనున్నాయి . ట్రైలర్ లోనే రకుల్ ఇంతగా అందాలను ఆరబోస్తే తెరమీద ఏ రేంజ్ లో అందాలు ఆరబోసి ఉంటుందో.

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే