హాట్ టాపిక్ :ఈ ముగ్గురూ 'మైత్రీ మూవీస్' ని లేపి నిలబెట్టగలరా?

By Prashanth MFirst Published Dec 3, 2018, 10:31 AM IST
Highlights

మైత్రీ మూవీ మేకర్స్ ఇండస్ట్రీలోకి రావటమే టాలీవుడ్ స్టార్ హీరోలతో వరస మూడు బ్లాక్ బస్టర్స్ తో వచ్చారు. మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తో రంగస్దలం ఘన విజయాలు సాధించాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఇండస్ట్రీలోకి రావటమే టాలీవుడ్ స్టార్ హీరోలతో వరస మూడు బ్లాక్ బస్టర్స్ తో వచ్చారు. మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తో రంగస్దలం ఘన విజయాలు సాధించాయి. ఆ తర్వాత వరస పెట్టి రెండు డిజాస్టర్స్ ఇచ్చారు. నాగచైతన్యతో సవ్యసాచి, రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు భయపెట్టే రీతిలో భాక్సాఫీస్ వద్ద బాంబుల్లా పేలాయి. ఈ నేపధ్యంలో ఈ సంస్ద నుంచి తదుపరి రాబోతున్న సినిమాలపై అందరి దృష్టీ ఉంది.

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మను దర్శకుడుగా పరిచయం చేస్తూ డియర్ కామ్రేడ్ టైటిల్ తో  ఓ ప్రాజెక్టు మొదలెట్టారు. ఆ షూటింగ్ జరుగుతోంది. ఫామ్ లో ఉన్న హీరో కాబట్టి హిట్, ఫ్లాఫ్ లకు సంభంధం లేకుండా ఓ రేంజిలో బిజినెస్ లో జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. 

అలాగే కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ తో చిత్ర లహరి టైటిల్ తో ఓ సినిమా మొదలెట్టారు. సాయి ధరమ్ తేజ వరస డిజాస్టర్స్ లో ఉన్నారు. కిషోర్ తిరుమల సైతం ప్లాఫ్ లో ఉన్నారు. దాంతో ఈ చిత్రం బిజినెస్ అనుకున్న స్దాయిలో జరగదని అంచనా వేస్తున్నారు. కాని బడ్జెట్ కంట్రోలులో పెట్టి ఈ ప్రాజెక్టుని లిప్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారట నిర్మాతలు.

నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తాజాగా ఓ చిత్రం ఎనౌన్స్ చేసారీ నిర్మాతలు. నానికు ఉన్న క్రేజ్ తో ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతుందని భావిస్తున్నారు. 

ఫైనల్ గా  రవితేజతో రభస దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తమిళ హిట్ థేరి రీమేక్ గా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. అయితే అమర్ అక్బర్ ఆంటోని డిజాస్టర్ తో ఈ చిత్రం తెరకెక్కుతుందా లేదా అనే సందేహం ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ 2019 లో రిలీజ్ కు రెడీ అవుతాయి.  అయితే ఈ బంచ్ లో పెద్ద హీరోలు ఎవరూ లేకపోవటం గమనార్హం. 

స్టార్ హీరోల డేట్స్ కు టైమ్ పడుతుందని మిడిల్ హీరోలతో సినిమాలు చేస్తూంటే అవి తేడా కొట్టి బ్యానర్ ప్రతిష్టనే మసకబారేలా చేస్తాయి. 14 రీల్స్ పరిస్దితి అదే. దూకుడు వంటి సూపర్ హిట్ ఇచ్చిన బ్యానర్ ఇప్పుడు చిన్న హీరోలతో సినిమాలు చేస్తోంది. సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. మైత్రీ మూవీస్ వాళ్ల ప్లానింగ్ కు ఆ సిట్యువేషన్ ఎదురుకాదని చెప్తున్నారు. ఏదైమైనా పెద్ద బ్యానర్స్ సరైన ప్లానింగ్ తో వెళ్లకపోతే ఇబ్బందే. 

click me!