రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన సునీల్.. నిర్మాత జంప్!

By Udayavani Dhuli  |  First Published Dec 2, 2018, 8:10 PM IST

కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ ఆ తరువాత హీరోగా మారి సినిమాలు చేయడం ఆరంభించాడు. సిక్స్ ప్యాక్, స్టార్ హీరోలకు ధీటుగా డాన్సులు ఇలా ఎన్ని చేసినా హీరోగా అతడికి విజయాలు మాత్రం దక్కలేదు. 


కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ ఆ తరువాత హీరోగా మారి సినిమాలు చేయడం ఆరంభించాడు. సిక్స్ ప్యాక్, స్టార్ హీరోలకు ధీటుగా డాన్సులు ఇలా ఎన్ని చేసినా హీరోగా అతడికి విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో తిరిగి మళ్లీ కమెడియన్ వేషాలు వేయడానికి సిద్ధమయ్యాడు.

ఈ క్రమంలో అతడు సిల్లీ ఫెలోస్, అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా కొన్ని సినిమాల్లో నటించాడు కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే హీరోగా ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.

Latest Videos

రచయిత వెలిగొండ శ్రీనివాస్.. రాజ్ తరుణ్ హీరోగా 'అంధగాడు' సినిమాను రూపొందించి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పుడు సునీల్ ని డైరెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వెలిగొండ శ్రీనివాస్. ఓ కొత్త నిర్మాత ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయాల్సివుంది.

అయితే సునీల్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ తో ఆ కొత్త నిర్మాత ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ లో తన క్రేజ్ తగ్గిపోయినప్పటికీ సునీల్ మాత్రం రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడట. దీంతో షాక్ అయిన నిర్మాత సినిమా చేయడానికి నిరాకరించాడట. దీంతో ఇప్పుడు వెలిగొండ శ్రీనివాస్ కొత్త నిర్మాత కోసం వెతుకులాట మొదలెట్టాడు. మరి సునీల్ మీద ఎవరు పెట్టుబడి పెడతారో చూడాలి!

click me!