Will Smith: ఆస్కార్ ఎఫెక్ట్ ... హాలీవుడ్ లో ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు

Published : Apr 03, 2022, 05:32 PM IST
Will Smith: ఆస్కార్ ఎఫెక్ట్ ... హాలీవుడ్ లో ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు

సారాంశం

ఆస్కార్ వేడుకల సందర్భంగా జరిగిన సంఘటలన ఇక సమసిపోయినట్టే అనుకున్నారు అంతా ఎవరి పనులో వారు బిజీ అయిపోయారు. కాని ఈ ఇష్యూ ఇంతటితో ఆగినట్టు కనిపించడం లేదు. లోపల రగులుతూనే ఉన్న ఆ వివాద ప్రభావం ఇప్పుడు విల్ స్మిత్ సినిమాల మీద పడింది.   

ఆస్కార్ వేడుకల సందర్భంగా జరిగిన సంఘటలన ఇక సమసిపోయినట్టే అనుకున్నారు అంతా ఎవరి పనులో వారు బిజీ అయిపోయారు. కాని ఈ ఇష్యూ ఇంతటితో ఆగినట్టు కనిపించడం లేదు. లోపల రగులుతూనే ఉన్న ఆ వివాద ప్రభావం ఇప్పుడు విల్ స్మిత్ సినిమాల మీద పడింది. 

ఆస్కార్‌ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్ స్మిత్ కు టైమ్ కలిసి రావడం లేదు. సర్ధుమణిగింది అనుకున్న ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. పాపం హాలీవుడ్ స్టార్ హీరోకు టైం సరిగా లేనట్లే ఉంది. ఆస్కార్ వేడుకలప్పటి నుంచీ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ఆస్కార్ సందర్భంగా యాంకర్ క్రిస్ ను చెప్ప దెబ్బ కొట్టాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. 

తన భార్య జాడా పింకెట్‌ అనారోగ్యంపై ప్రముఖ అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ జోక్‌ వేశాడన్న కారణంతో విల్‌ అతని చెంపచెల్లుమనిపించాడు. ఆస్కార్‌ అందుకంటూ ఈ సంఘటనపై అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు క్షమాపణలు కూడా చెప్పాడు విల్‌ స్మిత్‌. అటు సోషల్‌ మీడియా లో కూడా  క్రిస్‌ రాక్‌ను క్షమించమని కోరాడు విల్ స్మిత్.

ఇక ఇన్ని జరిగాయి. ఇక ఈ వివాదం సద్దుమణిగింది  అనుకుంటుండగా.. మళ్లీ రగిలి.. విల్‌ స్మిత్‌ రాజీనామా చేసేదాకా వెళ్లింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ అకాడమీకి విల్‌ స్మిత్ రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలిపాడు. ఆ చెంపదెబ్బ వ్యవహరం ప్రభావం ఎంత వరకూ వెళ్లిందంటే  విల్ స్మిత్ కెరీర్ ప్రభావం పడింది. 

ఈ చెంపదెబ్బ వ్యవహారంలో విల్‌ స్మిత్‌ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోయినా.. ఆయన కెరీర  పరంగా ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. విల్‌ హీరోగా రాబోయే  సినిమాలు వరుసగా ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం విల్ స్మిత్ ఫాస్ట్‌ అండ్‌ లూజ్‌ మూవీ  ఆగిపోయినట్టు సమాచారం.  ఈ సినిమాను నిర్మిస్తున్న హాలీవుడ్ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రస్తుతం ఆ మూవీని హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. 

ఈ ఆస్కార్‌ సంఘటనకు కొన్ని వారాల ముందు డైరెక్టర్‌ డేవిడ్ లీచ్ రియాన్ గోస్లింగ్‌ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన ఈ సినిమాను  వదిలిపెట్టి ఫాల్‌ గాయ్‌ సినిమాను  దర్శకత్వం చేయడానికి వెళ్లాడు. దాంతో ఈ సినిమాకు సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆస్కార్ ఎఫెక్ట్ తో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలని చూస్తోందట. దీనంతటికి కారణం క్రిస్‌రాక్‌పై విల్‌ చేయిచేసుకోవడమే అని హాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

అయినా పర్లేదు ఫాస్ట్‌ అండ్‌ లూజ్‌ హోల్డ్‌లో ఉన్నప్పటికీ మా విల్ చేతిలో విల్ స్మిత్‌ చేతిలో ఎమాన్సిపేషన్‌, యాపిల్‌ టీవీ ప్లస్‌ లాంటి మరిన్ని సినిమాలు ఉన్నాయి అంటున్నారు విల్ స్మిత్ ను సపోర్ట్ చేసే ఆయన ఫ్యాన్స్. మనె వైపు బ్యాడ్‌ బాయ్స్ 4 కోసం విల్ ను అనుకున్నారు మేకర్స్. ఈలోపు  ఆస్కార్ వ్యవహారం  జరగడంతో ఈ ప్రాజెక్ట్‌ను కూడా సోనీ హోల్డ్‌లో ఉంచినట్లు  తెలుస్తోంది. ఇక ముందు ముందు విల్ లైఫ్ లో ఏం జరుగుతుందో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?