`ఆర్‌ఆర్‌ఆర్‌` సక్సెస్‌ ఆనందంలో టీమ్‌ కి బంగారు కానుకలిచ్చిన రామ్‌చరణ్‌

Published : Apr 03, 2022, 05:17 PM IST
`ఆర్‌ఆర్‌ఆర్‌` సక్సెస్‌ ఆనందంలో  టీమ్‌ కి బంగారు కానుకలిచ్చిన రామ్‌చరణ్‌

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో చరణ్‌కి దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ పేరొచ్చింది. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఫుల్‌ హ్యాపీగా ఉన్న రామ్‌చరణ్‌.. తన హ్యాపీనెస్‌ని పంచుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి తెరవెనుక కష్టపడిన టీమ్‌తో పంచుకున్నారు. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan).. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ఏకంగా సుమారు రూ.750కోట్లు వసూలు చేసింది. మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా రన్‌ అవుతుంది. ఈ సినిమాతో రామ్‌చరణ్‌కి మంచి పేరొచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నిలిచిపోయారు. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్‌ స్టార్‌ కృష్ణ గుర్తుకొచ్చేవారు. ఇప్పుడు చరణ్‌ గుర్తొస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాలో క్లైమాక్స్ ఆయన అల్లూరి గెటప్‌లో విశ్వరూపం చూపించారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాతో చరణ్‌కి దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ పేరొచ్చింది. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఫుల్‌ హ్యాపీగా ఉన్న రామ్‌చరణ్‌.. తన హ్యాపీనెస్‌ని పంచుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి తెరవెనుక కష్టపడిన టీమ్‌తో పంచుకున్నారు. ఈ చిత్రానికి పనిచేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్‌ఓడీలు, వివిధ విభాగాల అసిస్టెంట్లని తన ఇంటికి ఆహ్వానించి గిఫ్ట్ లు ఇచ్చారు. ఆదివారం ఉదయం వారిని ఆల్పాహార విందుకి ఆహ్వానించారు. 

ఇందులో సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఉన్నారు. వారితో కాసేపు ముచ్చటించిన రామ్‌చరణ్‌ వారికి ఊహించిన సర్‌ప్రైజ్‌లిచ్చారు. ఒక్కొకరికి ఒక్కో తులం గోల్డ్ కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందంటూ అభినందిస్తూ రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌.. మరో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ శంకర్‌తో `ఆర్‌సీ 15` మూవీ చేస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాని వచ్చే సంక్రాంతి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇందులో చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతోపాట గౌతమ్‌ తిన్ననూరితోనూ ఓ సినిమా చేస్తున్నారు చరణ్‌. వీటితోపాటు పలు బాలీవుడ్‌ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?