Will Smith: చెంప దెబ్బ ఘటన ఎఫెక్ట్.. అకాడమీ సభ్యత్వానికి విల్ స్మిత్ రాజీనామా

Published : Apr 02, 2022, 07:34 AM IST
Will Smith: చెంప దెబ్బ ఘటన ఎఫెక్ట్.. అకాడమీ సభ్యత్వానికి విల్ స్మిత్ రాజీనామా

సారాంశం

గత ఆదివారం జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.. యాంకర్, కమెడియన్ క్రిస్ రాక్ ని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర వివాదంగా మారింది.

గత ఆదివారం జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.. యాంకర్, కమెడియన్ క్రిస్ రాక్ ని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర వివాదంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విల్ స్మిత్ అభిమానులంతా ఈ సంఘటన గురించే చర్చించుకుంటున్నారు. 

ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన విల్ స్మిత్ అకాడమీకి రాజీనామా చేశారు. ఇది కాస్త విల్ స్మిత్ ఫ్యాన్స్ కి షాకింగ్ గా మారింది. నేను ఆస్కార్ వేడుకలో ప్రవర్తించిన విధానం షాకింగ్ గా, బాధాకరంగా ఉంది. అందుకే అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అంటూ విల్ స్మిత్ తన స్టేట్మెంట్ లో ప్రకటించారు. బోర్డు సభ్యులు తీసుకునే ఎలాంటి చర్యలకైనా నేను సిద్ధం అని విల్ స్మిత్ ప్రకటించారు. దీనితో విల్ స్మిత్ అందుకున్న ఆస్కార్ అవార్డుపై సందిగ్దత నెలకొంది. 

గత ఆదివారం ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అందరిని ఎంటర్టైన్ చేసేందుకు కామెడీ పంచ్ లు వేశాడు. ఈ వేడుకకు విల్ స్మిత్, తన సతీమణి జాడా పింకెట్ తో కలసి హాజరయ్యాడు. జాడా కొంత కాలంగా అలోపీసియా అనే వ్యాధితో భాదపడుతున్నారు. దీనితో ఆమె గుండుతో కనిపించారు. 

వేదికపై క్రిస్ రాక్ ఆమె గుండుని ఓ సినిమాలో సన్నివేశంతో పోల్చుతూ జోకులు వేశాడు. దీనితో తన సతీమణిని అవమానించేలా ప్రవర్తించిన క్రిస్ రాక్ తీరుని విల్ స్మిత్ సహించలేకపోయాడు. వేదికపైకి వెళ్లి క్రిస్ రాక్ చెంప చెళ్లుమనిపించాడు. ఇది కాస్త వివాదంగా మారింది. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. 

ఈ సంఘటన అనంతరం విల్ స్మిత్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. తన భార్యపై జోకులు వేయడంతో భరించలేకే అలా ప్రవర్తించాను అని విల్ స్మిత్ చెప్పుకొచ్చాడు. వేదికపై ఏం జరిగిందో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు అని క్రిస్ రాక్ స్పందించాడు. స్మిత్ రాజీనామా చేయకపోయినా అతడిపై తప్పకుండా ఉండేవని అకాడమీ  బోర్డు సభ్యులు అంటున్నట్లు హాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?