
జబర్ధస్త్ కామెడీషోలో స్టైలీష్ లుక్స్ తో ఆకట్టుకునే స్టార్ సుడిగాలి సుధీర్. కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా... ఇప్పుడు హీరోగా తన టాలెంట్ కు పదును పెడుతున్న సుధీర్ యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆర్టిస్టులలో సుడిగాలి సుధీర్ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన సుధీర్.. ఆ తరువాత హీరోగా ఒక్కో సినిమాను చేస్తూ వెళుతున్నాడు. సుధీర్ కి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాని జబర్థస్త్ షోలో తప్పించి ఇంత వరకూ సుధీర్ చేసిన సినిమాలేవీ అంతగా ప్రేక్షకుల ఆదరణను పొందలేక పోయాయి.
అయినా సరే పట్టుదలతో సినిమాలు చేస్తూనే ఉన్నాడు సుధీర్. ఇక ఆయన తాజా సినిమా కాలింగ్ సహస్ర ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈమూవీని.. షాడో మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి, అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అరవింద్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు.
బ్రతకడం కోసం చంపడం సృష్టి ధర్మం .. చంపడం తప్పుకానప్పుడు .. దానిని చూపించడం తప్పెలా అవుతుంది డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది టీజర్. కొత్త సిమ్ తీసుకున్న హీరోకి.. కొత్త జీవితం మొదలవుతుంది. అప్పటి నుంచి ఆయన జీవితంలో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అందుకు కారణమేమిటనేదే లైన్ గా సినిమాను తెరకెక్కించారు. త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు టీమ్.